Ram Charan:మెగా స్టార్ చిరంజీవి నట వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ మొదట్లో ఒడిదుడుకులు ఎదుర్కొన్న తర్వాత తనకంటూ సొంత గుర్తింపుతో నటన, గ్రేస్ ఉన్న డాన్సు తో ప్రేక్షకులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్,తారక్ కాంబినేషన్లో వస్తున్న అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్ విడుదలకు సిద్ధమైంది. మార్చి 25న ఈ సినిమా విడుదలకు ఏర్పాట్లు జరిగాయి. ప్రస్తుతం ప్రమోషన్ల బిజీ లో ఉన్నారు ఆర్ ఆర్ ఆర్ టీం. ఇదిలా ఉండగా ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాటు ఏక కాలంలోనే మెగాస్టార్ చిరంజీవి తో నటించిన ఆచార్య ప్రస్తుతం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.
ఆర్ఆర్‌ఆర్’ తర్వాత చేసే సినిమాలు పాన్ ఇండియా సినిమాలే అవ్వాలని రామ్ చరణ్ అనుకుంటున్నాడో లేదో తెలియదు కానీ,రామ్ చరణ్ తీస్తున్న సినిమాలు మాత్రం అలానే ఉన్నాయి.శంకర్,దిల్ రాజు,రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా పాన్ ఇండియా సినిమా అని తెలిసినదే. శంకర్,రామ్ చరణ్ సినిమా తర్వాత రామ్ చరణ్,యు.వి.క్రియేషన్స్ కాంబినేషన్లో ఒక సినిమా ఉంటుందని అది కూడా పాన్ ఇండియా సినిమానే అని సమాచారం. ఈ సినిమాకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించబోతున్నారు.స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో మంచి కథ కూడా కుదిరిందని సమాచారం.కథ విషయంలో చిత్రబృందం నుండి అధికారిక సమాచారం లేనప్పటికీ. ఈ కథలో రామ్ చరణ్ ఫుట్‌బాలర్‌గా కనిపిస్తాడని మాత్రం అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాను జులైలో ప్రారంభించాలని చిత్రబృందం అనుకుంటోందట.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనల్లో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి బిజీగా ఉన్నారు. ఈ సినిమాని విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిస్తున్నట్లు గా దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సినిమాలు త్వరలోనే మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ పనులు మొదలు పెడతారు. ఆ తర్వాత ఆచార్య సినిమాకు సంబంధించిన ప్రమోషన్ పనులు మొదలవుతాయి.
చరణ్ మరో నెలన్నర రోజులు ప్రచారంతో బిజీ. ఆ తర్వాత సినిమా షూటింగ్‌లు మొదలవుతాయి. శంకర్ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ అంటున్నారు. గౌతమ్ ప్రాజెక్ట్ అయితే సమ్మర్‌కి అని అంటున్నారు. ఇలా ఆర్ ఆర్ ఆర్, ఆచార్య, చరణ్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా, గౌతమ్ తిన్ననూరి రాంచరణ్ సినిమా ఇలా అన్ని పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. రామ్ చరణ్ అభిమానులకు పండగ అని చెప్పవచ్చు.