Ram Charan : సముద్రఖని దర్శకత్వంలో మెగా హీరో…త్వరలోనే భారీ బడ్జెట్ సినిమా..?

 

Ram Charan: మెగా స్టార్ రామ్ చరణ్ ,ఎన్టీఆర్ కలిసి నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించిన సంగతి తెలిసినదే. ఆర్ ఆర్ ఆర్ సినిమాని మార్చి 25న ప్రేక్షకులను అలరించడానికి విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆర్ ఆర్ ఆర్ అని కాకుండా రామ్ చరణ్ ఇంకా కొన్ని సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు.

మెగాస్టార్ చిరంజీవి తో కలిసి నటించిన ఆచార్య సినిమా ఇప్పటికే విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాని కొరటాల శివ దర్శకత్వం వహించారు. దీనితోపాటు,రామ్ చరణ్ శంకర్ మరియు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కూడా సినిమాలు చేయబోతున్నారు. రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇవి కాకుండా, వీటితో పాటు ఇప్పుడు రామ్ చరణ్ తదుపరి చిత్రం మీద వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్, బహుముఖ ప్రతిభ కలిగిన నటుడు సముద్రఖని దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

తెలుగు ప్రేక్షకులకు సముద్రఖని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన శంభో శివ శంభో, రఘువరన్ బీటెక్, విఐపి 2, జెండాపై కపిరాజు,అలా వైకుంఠపురం లో,క్రాక్, ఇటీవల విడుదలైన భీమ్లానాయక్ వంటి సినిమాలలో తనదైన నటనతో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఈయన నటుడుగానే కాకుండా దర్శకుడిగా కూడా విషయాలు సాధిస్తున్నాడు. ఇటీవల విడుదలైన వినోదయ సీతం సినిమాతో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేయబోతున్నారు.

ప్రస్తుతం సముద్రఖని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించాలని చూస్తున్నారట. దీని గురించి చర్చలు జరుగుతున్నాయట, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుంది ఏమో చూడాలి.