హాలీవుడ్ మూవీలో రామ్‌చరణ్.?

‘ఇప్పుడున్న కమిట్మెంట్స్ పూర్తయ్యాక, హాలీవుడ్ సినిమాలో నటిస్తా..’ అంటూ అమెరికాలో, ‘హెచ్‌సి’ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. అదీ తనంతట తాను కాదు.

ఓ టీవీ షోలో అడిగిన ప్రశ్నకు రామ్ చరణ్ సమాధానమిస్తూ, తనకూ హాలీవుడ్ సినిమా చేయాలనీ, ఇండియన్ టాలెంట్‌ని హాలీవుడ్ ఫిలిం మేకర్స్ ప్రోత్సహించాలనీ చెప్పుకొచ్చాడు.

ఏదో యధాలాపంగా రామ్ చరణ్ చేసిన వ్యాఖ్య కాదట ఇది. ఓ హాలీవుడ్ సినిమా కోసం రామ్ చరణ్‌తో కొన్నాళ్ళ క్రితమే సంప్రదింపులు జరిగాయని తెలుస్తోంది. అది కూడా ఓ ప్రతిష్టాత్మక వెంచర్ కోసమట.

హాలీవుడ్ సినిమాలకు ఇండియన్ మార్కెట్ ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఇండియన్ స్టార్స్ మీద హాలీవుడ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. హాలీవుడ్‌లో చరణ్ అడుగు పెట్టడం ఖాయమైతే.. అది చాలా చాలా ప్రత్యేకమైన సందర్భం అవుతుంది.