ఒకే కారులో ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చిన రామ్‌చరణ్‌ – ఎన్ఠీఆర్

చరణ్‌ గురించి తారక్‌, తారక్‌ గురించి చరణ్‌.. ఎన్నో విషయాలు షేర్‌ చేసుకుంటారు.. ఇప్పుడు మళ్లీ వారిద్దరూ ఒకే కారులో కనిపించి.. అందరినీ ఆశ్చర్యపరిచారు. తారక్‌, చరణ్‌ ఇద్దరూ వారి ఫ్యామిలీలతో కలిసి వేరు వేరు ఫంక్షన్స్‌కి హాజరయ్యే నిమిత్తం.. ఇద్దరూ కలిసి ఒకే కారులో ఎయిర్‌పోర్ట్‌కి రావడం విశేషంగా మారింది.

రామ్‌ చరణ్‌, ఉపాసన దంపతులు ముకేశ్‌ అంబానీ తనయుడు వివాహానికి హాజరయ్యే నిమిత్తం ముంబై.. తారక్‌, లక్ష్మీ ప్రణతి దంపతులు బెంగళూర్‌లోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు పయనమయ్యారు. ప్రస్తుతం వారు గమ్యస్థలాలకు చేరుకున్న వీడియోలు కూడా వైరల్‌ అవుతున్నాయి.

అయితే ఆ ఈవెంట్స్‌ వెళ్లే నిమిత్తం.. చరణ్‌, తారక్‌ ఇద్దరూ ఒకే కారులో నుంచి దిగి ఎయిర్‌ పోర్ట్‌కు వెళుతున్న వీడియో ప్రస్తుతం బాగా వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా.. మరోసారి ఇద్దరూ వారి మధ్య ఉన్న బాండింగ్ ని తెలియజేశారంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అనంతరం ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా తో ఓ సినిమా కమిటయ్యారు. తారక్‌ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ అనే సినిమా, బాలీవుడ్‌లో ‘వార్‌ 2’ సినిమాలు చేస్తున్నారు. ప్రశాంత్‌ నీల్‌తో ఓ సినిమా కమిటై ఉన్నారు.