Ram Charan: భారతీయ చలనచిత్ర చరిత్రలో తెలుగు సినిమా స్థాయిని మరొకసారి గుర్తు చేసిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా చూసిన సెలబ్రిటీలు అందరూ చిత్ర బృందాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. దర్శకుడు రాజమౌళి ఈ చిత్రాన్ని తీసిన విధానానికి అందరూ ఫిదా అయిపోతున్నారు. ఎన్టీఆర్ ,రామ్ చరణ్ వారి పాత్రలకు ప్రాణం పోశారని చెప్పవచ్చు.కొన్నేళ్లుగా కష్టపడి తీసిన సినిమాకు తగిన ఫలితం లభించింది. అయితే ఈ సినిమా తర్వాత దర్శకుడు రాజమౌళి తో సహా ఎన్టీఆర్ చరణ్ చేసే కొత్త ప్రాజెక్టుల మీద అందరి దృష్టి ఉంటుంది.
ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత చరణ్ నటించిన ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆచార్య సినిమా కొరటాల శివ దర్శకత్వంలో రానున్నది. ఈ సినిమాలో చరణ్ మెగాస్టార్ చిరంజీవి తో పాటు కలిసి నటించారు. చరణ్ కు జోడిగా పూజాహెగ్డే నటించగా మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించారు. చరణ్ నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత వస్తుండడంతో ఈ సినిమాలో చరణ్ పాత్ర ఎలా ఉంటుంది అన్న దానిపై అందరి దృష్టి ఉంది. అయితే ఈ సినిమాలో కూడా రామ్ చరణ్ ఒక పోరాట వీరుడు గానే కనిపిస్తారట.
ఆచార్య సినిమా తర్వాత రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఇది కూడా యాక్షన్ సినిమానే అని అంటున్నారు. ఈ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కూడా ఒక సినిమా పట్టాల కాబోతోంది. మొదట ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ లో ఉంటుంది అన్న వార్తలు వినిపించాయి కానీ, ఇది పూర్తిస్థాయి యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో ఉంటుందని చెబుతున్నారు. ఈ యాక్షన్ కొత్తగా ఉంటుందట .. ఇంతవరకూ వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నారు. మొత్తానికి రామ్ చరణ్ అన్ని యాక్షన్ పాత్రలు చేస్తున్నారు.