Peddi : పెద్ది మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్.. పూనకాలు లోడింగ్ అంటున్న మెగా ఫ్యాన్స్..!

రామ్ చరణ్‌కి ‘RRR’ ఇచ్చిన ఊపు ‘గేమ్ ఛేంజర్’తో ఒక్కసారిగా కూలిపోయింది. దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఆ చిత్రం, బాక్సాఫీస్ వద్ద కనీసం రూ.100 కోట్ల షేర్‌ను కూడా అందుకోలేకపోవడంతో ఘోరమైన ఫ్లాప్‌గా మిగిలింది. అభిమానులు కూడా ఈ సినిమాను మళ్లీ చూడాలనే ఆసక్తిని చూపించకపోవడం వల్లనే అది ఏ రేంజ్ డిజాస్టర్ అయిందో అర్థమవుతుంది. చెర్రీ కెరీర్‌లో ఇది అత్యంత దారుణమైన సినిమాగా మిగిలింది. అయితే ఆ ఫెయిల్యూర్ గాయం నుంచి ఇప్పుడు చరణ్ మాత్రమే కాదు, అతని ఫ్యాన్స్ కూడా మెల్లగా కోలుకుంటున్నారు. ఎందుకంటే తాజాగా చరణ్ చేస్తున్న కొత్త సినిమా నుంచి వచ్చిన చిన్న గ్లింప్స్‌తోనే అభిమానుల్లో మళ్లీ నూతన ఉత్సాహం వస్తోంది.

ఈ సినిమా కోసం చరణ్ లుక్ లో పూర్తిగా మారింది. పొడవాటి జుట్టు, ముదురు గడ్డం, ముక్కుపుడకతో అతను కనిపించే విధానం పూర్తిగా రఫ్ అండ్ రస్టిక్ మాస్ స్టైల్‌లో ఉండబోతుందని తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ భారీ సెట్‌లో ఫైటింగ్ సన్నివేశాల షూటింగ్ జరుపుకుంటున్నారు. ఈసారి స్క్రిప్ట్ పరంగా కూడా ఎలాంటి పొరపాట్లు చేయకూడదనే ఉద్దేశంతో మేకర్స్ అత్యంత జాగ్రత్తగా చిత్రీకరణ కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో రామ్ చరణ్ ఈ సినిమాలో ఉత్తరాంధ్ర నేపథ్యంలో పోషించే పాత్ర కోసం ఆ ప్రాంత మాండలికం నేర్చుకుంటున్నాడట.

ఇప్పటికే రిలీజ్ తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ ఈ సినిమాలో చరణ్‌కు జోడీగా నటిస్తుండగా, శివరాజ్ కుమార్‌, జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి కీలక నటులు ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. కెమెరా వర్క్ బాధ్యతలు ‘రంగస్థలం’ ఫేమ్ రత్నవేలు తీసుకుంటుండగా, ఎడిటింగ్ పనులను నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి నిర్వర్తిస్తున్నారు.

ఇక మ్యూజిక్ విషయానికొస్తే, ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రెండు పాటల ట్యూన్లు రెడీ అయిపోయాయని సమాచారం. తాజా బజ్ ప్రకారం.. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రైట్స్‌ను టీ సిరీస్ ఏకంగా రూ.35 కోట్లకు సొంతం చేసుకుందని టాక్. ఒక్క ఆడియో హక్కులకు ఇంత భారీ మొత్తం వచ్చిందంటే సినిమా పట్ల ఉన్న ఆసక్తి ఏ స్థాయిలో ఉందో చెప్పక్కర్లేదు.

‘గేమ్ ఛేంజర్’ తర్వాత రామ్ చరణ్ మరోసారి ఫైర్ అవుతున్నాడు. లుక్ లోనూ, ఎక్స్‌ప్రెషన్స్ లోనూ, పాత్ర ఎంపికలోనూ అన్ని కోణాల్లోనూ చరణ్ తనలోని మాస్ యాంగిల్‌ను తిరిగి బయటకు తీయడానికి సిద్ధమవుతున్నట్టే కనిపిస్తోంది. ఈసారి చరణ్ ఊచకోత తప్పదని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. “పెద్ది” అంటూ వర్కింగ్ టైటిల్‌తోనే హడావుడి మొదలైపోయింది. అసలైన టైటిల్ వచ్చేసరికి మరింత రచ్చే జరుగనుంది.