రామ్ చరణ్ కోనం ‘యానిమల్’ బ్యూటీని తెస్తారా.?

రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమా పనుల్లో బిజీగా వున్నాడు. తమిళ దర్శకుడు శంకర్‌తో సినిమా అంటే మామూలుగా వుండదు. ఏళ్భ తరబడి అతని సినిమాలు నిర్మాణంలోనే వుంటాయి. చెక్కుతూనే వుంటాడు సినిమాల్ని.

అలా రామ్ చరణ్ కెరీర్‌లో సమయం వృధా అయిపోతూ వస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత, ‘ఆచార్య’ సినిమాలో చరణ్ గెస్ట్ రోల్ చేసినా, ‘ఆచార్య’ డిజాస్టర్ నేపథ్యంలో, చరణ్ నుంచి ఇంకో సూపర్ హిట్‌ని చాలా వేగంగా ఆశిస్తున్నారు చరణ్ అభిమానులు.

సంక్రాంతికే ‘గేమ్ ఛేంజర్’ రావాల్సి వున్నా, శంకర్ పుణ్యమా అని సినిమా ఆలస్యమయ్యింది. సమ్మర్‌లో సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు లేవు. ఇదిలా వుంటే, చరణ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ సినిమా సెట్స్ మీదకు వెళ్ళాల్సి వుంది.

ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు.? అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. రషా తథానీ అనే బాలీవుడ్ బ్యూటీకి స్క్రీన్ టెస్ట్ చేశారుగానీ, టెస్ట్ రిజల్ట్ ఏంటన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.

తాజాగా, ఈ సినిమా కోసమే ‘యానిమల్’ బ్యూటీ త్రిప్తి దిమ్రి పేరు ఖరారైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మెయిన్ హీరోయిన్.? సెకెండ్ హీరోయిన్.? అన్న సందేహాలైతే వున్నాయ్. దాదాపు ఖాయమేనట త్రిప్తి దిమ్రి.!