భార్య ఉపాసనకు రామ్‌ మసాజ్‌.. వైరల్‌గా మారిన వీడియో!

మెగా కోడలు ఉపాసన కాళ్లకు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ మసాజ్‌ చేస్తున్న వీడియో ఒకటి సోషల్‌ మాధ్యమాలలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా.. ఈ సామెతనే గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం రామ్‌ చరణ్‌ తన భార్య ఉపాసనతో కలిసి అంబానీ ఇంట పెళ్లికి హాజరైన విషయం తెలిసిందే.

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగిన అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌లో రామ్‌ చరణ్‌, ఉపాసనలతో పాటు పలువురు సెలబ్రిటీలు సందడి చేశారు. అంతకు ముందు ఈ వేడుకకు హాజరయ్యేందుకు ఎన్టీఆర్‌ దంపతులతో కలిసి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చారు చరణ్‌ దంపతులు.

ఎన్టీఆర్‌ దంపతులు బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఈవెంట్‌కు హాజరు కాగా, చరణ్‌ దంపతులు ఇలా అంబానీ ఇంట జరిగిన ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ లో సందడి చేశారు. ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌లో చరణ్‌తో కలిసి ఉపాసన వెళుతున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న సమయంలోనే.. తాజాగా ఈ మసాజ్‌ వీడియో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఉపాసన ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

ఈ ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌లో అలసిపోయిన ఉపాసనకు చరణ్‌ ఇలా మసాజ్‌ చేస్తూ కనిపించారు. చరణ్‌ మసాజ్‌ చేస్తుంటే.. ఉపాసన హాయిగా నిద్రపోతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా భార్య పట్ల రామ్‌ చరణ్‌ చూపిస్తున్న కేరింగ్‌ చూసి వావ్‌ అంటున్నారు. ఎంతటి స్టార్‌ అయినా భార్య కాళ్లు పట్టాల్సిందే అంటూ కొంతమంది సరదాగా కామెంట్స్‌ వేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.