Ram Charan : ఆ సినిమాలోని తారక్ నటన బాగా నచ్చుతుంది – చరణ్… సినిమా సినిమా కి మధ్య తారక వేరియేషన్స్ పై ప్రశంసలు..!

Ram Charan : ఇండస్ట్రీలో రామ్ చరణ్ ఎన్టీఆర్ మంచి స్నేహితులు అనే విషయం ముందు నుంచి తెలిసిందే. అయితే మూడేళ్లపాటు తీసిన ఆర్ఆర్ఆర్ సినిమాతో వాళ్ల స్నేహం మరింత బలపడింది అనే చెప్పాలి. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు ముందు జరిగిన ప్రమోషన్ కార్యక్రమాలలో చరణ్ తారక్ వారిద్దరి మధ్య ఉన్న స్నేహం ఎంత బలమైనదో తెలియజేశారు. సందర్భం దొరికిన ప్రతి సారి వాళ్ళు ఒకరి మీద ఒకరికి ఉన్న వాళ్ల అభిమానాన్ని చాటుకుంటున్నారు.

ఆర్ ఆర్ ఆర్ ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా మొదలు పెట్టే పనిలో ఉన్నాడు. అయితే రామ్ చరణ్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి తో కలిసి నటించిన ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. విడుదల సమయం దగ్గర పడుతుండటంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లు కూడా జరుగుతున్నాయి. ప్రమోషన్ లో భాగంగా రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి ఇలా చెప్పుకొచ్చారు. జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ నటన తనకు చాలా బాగా నచ్చుతుంది అని చెప్పారు. అలాగే టెంపర్ సినిమా లో ఎన్టీఆర్ నటనకు అలాగే జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు చాలా తేడా ఉందని సినిమా సినిమాకి ఎన్టీఆర్ చూపించిన వేరియేషన్స్ మీద రామ్ చరణ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇలా ఇద్దరు సందర్భం వచ్చినప్పుడల్లా ఒకరిమీద ఒకరు వారి అభిమానాన్ని చాటుకుంటున్నారు.

భవిష్యత్తులో కూడా అవకాశం వస్తే వీరిద్దరూ మరోసారి కలిసి నటించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇదిలా ఉండగా కొరటాల దర్శకత్వంలో వస్తున్న ఆచార్య సినిమా తో రామ్ చరణ్ మరొక హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడు అని అభిమానులు భావిస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న సినిమా పాన్ ఇండియా సినిమా అవ్వకపోవచ్చు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కొరటాల శివ పాన్ ఇండియా సినిమాల మీద దృష్టి పెట్టడం లేదని తెలుస్తోంది.