ఒక్క పోస్ట్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని తనవైపు తిప్పుకున్న రామ్ చరణ్.!

టాలీవుడ్ లో హీరోలు చాలా మంది వాళ్లలో వారు మంచి ఫ్రెండ్స్ ఉన్నారని తెలిసిందే. కాకపోతే చాలా వరకు ఎవరెవరు మంచి ఫ్రెండ్స్ అనేది తెలియకపోవచ్చు కానీ వారిలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి ఇద్దరు పెద్ద స్టార్స్ అందులోని రెండు పెద్ద ఫ్యామిలీ ల నుంచి మంచి ఫ్రెండ్స్ గా ఉన్నారు అనేది మాత్రం తమ లేటెస్ట్ సినిమా ఆర్ ఆర్ ఆర్ తోనే తెలిసింది.

అయితే వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అయినప్పటికీ కలిసి ఓ సినిమా చేసినప్పటికీ అభిమానులు కూడా అలాగే ఉంటారు అనుకుంటే జరగని పని. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని ఇప్పటికీ తన్నుకుంటున్నారు. ఐతే ఈ సినిమాలో ఎన్టీఆర్ సహా రామ్ చరణ్ కి కూడా భారీ స్పందన వచ్చింది.

మొదట్లో అయితే సినిమాలో మెయిన్ హీరో చరణ్ అని ఎన్టీఆర్ కి అన్యాయం చేశారన్న ఎన్టీఆర్ ఫాన్స్ ఇప్పుడు చరణ్ కాదు ఎన్టీఆర్ అంటూ పోస్ట్ లు చేస్తున్నారు. ఇలా ఇద్దరి మధ్య ట్రోల్స్ అలా నడుస్తూనే ఉంటాయి కానీ వారి మధ్య సోదర  భావం మాత్రం ఏ లెవెల్లో ఉంది అనేది రామ్ చరణ్ మరోసారి ప్రూవ్ చేసాడు.

లేటెస్ట్ గా పెట్టిన పోస్ట్ తో ఒక్కసారిగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని స్టన్ చేసాడు. రీసెంట్ గా ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లని అయితే బెస్ట్ ఏక్షన్ సినిమా నుంచి బెస్ట్ యాక్టర్ క్యాటగిరీ లో ప్రముఖ హాలీవుడ్ అవార్డ్స్ క్రిటిక్స్ ఛాయిస్ నుంచి ఎంపిక చేశారు.

ఇందులో హాలీవుడ్ దిగ్గజాలు, టామ్ క్రూయిజ్, నికోలస్ మరియు బ్రాడ్ పిట్ లాంటి వారితో నా సోదరుడు ఎన్టీఆర్ తో నా పేరు కూడా కలిపి చూడడం చాలా బాగుందని తెలిపాడు. దీనితో ఇన్ని రోజులు చరణ్ పై నెగిటివ్ గా ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ ఒక్క పోస్ట్ తో చరణ్ విషయంలో సైలెంట్ అయ్యారు.