అనుష్క సినిమాపై రామ్ చరణ్ లేట్ రివ్యూ..!

లేటెస్ట్ గా టాలీవుడ్ సినిమా దగ్గర వచ్చి సూపర్ హిట్ అయ్యిన చిత్రాల్లో హీరోయిన్ అనుష్క శెట్టి అవైటెడ్ సినిమాగా వచ్చిన చిత్రం “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” కూడా ఒకటి. అయితే అవ్వడానికి అనుష్క స్టార్ పవర్ ఉన్నప్పటికీ సినిమాని మాత్రం బయట హీరో నవీన్ పోలిశెట్టి ఒక్కడే తన భుజాలపై మోసి మరింత స్థాయిలోకి తీసుకెళ్లాడు.

మరి ఇంతలా కష్టపడ్డా ఈ చిత్రానికి అయితే ఎట్టకేలకి తగ్గ ఫలితం దక్కింది. వారం అవుతున్న ఈ సినిమా ఇప్పటికి మంచి రన్ ని కొనసాగిస్తూ దూసుకెళ్తుంది. కాగా తెలుగు నుంచి సహా కోలీవుడ్ నుంచి కూడా అనేకమంది స్టార్ నటులు ఈ సినిమాపై తమ రివ్యూని అందించగా ఇప్పుడు ఈ లిస్ట్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రివ్యూ కూడా చేరింది.

మరి చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాకి ఫస్ట్ ఎవర్ రివ్యూ అందించగా ఇప్పుడు రామ్ చరణ్ గా రివ్యూ ఇచ్చాడు. అయితే తాను పోస్ట్ చేసి జస్ట్ ఇప్పుడే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాని చూశానని ఇది నవీన్ పోలిశెట్టి నవ్వుల ప్రవాహం అనుష్క ఎవర్ గ్రీన్ ఛార్మ్ లతో ఓ పర్ఫెక్ట్ పెయిర్ గా అదిరిపోయింది అని అలాగే దర్శకుడు మహేష్ బాబు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వారికీ కంగ్రాట్స్ చెప్తున్నాను అని ఈ సక్సెస్ వారికి ఎంతో గర్హనీయమైంది అని చరణ్ తెలిపాడు. దీనితో చరణ్ పవర్ ఫుల్ రివ్యూ ఈ చిత్రానికి మరింత బూస్టప్ గా మారింది అని చెప్పొచ్చు. 
https://x.com/AlwaysRamCharan/status/1702993321596190933?s=20