Ram Charan: అమృత్ సర్ కి బయలుదేరనున్న రామ్ చరణ్…. కారణం ఆ సినిమానేనా?

Ram Charan: ఆర్ఆర్ఆర్ ఈ సినిమా ద్వారా ఎంతో మంచి విజయాన్ని అందుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా ఒక వైపు ఈ సినిమా విజయాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్ మరోవైపు తన తదుపరి సినిమాలపై కూడా దృష్టి సారించారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కోసం అమృత్‌సర్‌కిపయనమైనట్లు తెలుస్తోంది.

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ప్రధానపాత్రలో పాన్ ఇండియా సినిమాగా భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ అమృత్ సర్ లో జరగనుంది. అందుకే చరణ్ ఈ సినిమా షూటింగ్ నిమిత్తం అమృత్‌సర్‌కి బయలుదేరనున్నారు. ఈ సినిమా షూటింగ్ రాజమండ్రిలో షెడ్యూల్ పూర్తి చేసుకున్న తర్వాత రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి హాలిడే వెకేషన్ వెళ్లారు.

ఇక హాలిడే వెకేషన్ పూర్తి చేసుకున్న రామ్ చరణ్ అటునుంచి సరాసరి RRR సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉండటం వల్ల చరణ్ కొద్దిరోజులపాటు శంకర్ సినిమాకు విరామం ఇచ్చారు. ఇక ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకున్న తర్వాత తిరిగి శంకర్ సినిమాతో బిజీ కానున్నారు. ప్రస్తుతం అమృత్ సర్ లో భారీ యాక్షన్ సన్నివేశాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చరణ్ యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనడం కోసం అమృత్ సర్ వెళ్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాని నటిస్తున్న సంగతి తెలిసిందే.