Ram Charan: రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న RC15 సినిమా షూటింగ్ లో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా ఇప్పటికే శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది. ప్రస్తుతం చిత్రబృందం రాజమండ్రిలో ఓ షెడ్యూల్ చిత్రీకరణలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే ఈ సినిమా ప్రస్తుతం వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇక ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారని,అవినీతికి ఎదురెళ్లే ప్రభుత్వ అధికారిగా కనిపించబోతోన్నాడనీ తెలుస్తోంది.
ఈ సమయంలోనే ఈ సినిమా అవినీతికి అడ్డుకట్ట వేసే నేపథ్యంలో తెరకెక్కడంతో ఈ సినిమాకి సర్కారోడు అనే టైటిల్ పెట్టాలనే ఉద్దేశంలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మహేష్ బాబు కూడా ప్రస్తుతం జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా పోరాడే నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రంగా మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ క్రమంలోనే ఈ రెండు సినిమాలు ఒకటే కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయని తెలుస్తోంది. ఇక టైటిల్ విషయంలో కూడా రామ్ చరణ్ మహేష్ బాబును అనుసరిస్తున్నారని సమాచారం.
ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో నటించగా ఒక పాత్రలో పవర్ ఫుల్ స్టిక్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఇకపోతే ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని 200 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మొదటిసారిగా పాన్ ఇండియా స్థాయిలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా అంటే బడ్జెట్ విషయంలోనూ అలాగే నటీనటుల ఎంపిక విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కారనే విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా విడుదల కావడంతో ప్రముఖ బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్ ఈ సినిమాలో నటించబోతున్నారు.