రామ్ చరణ్ పవర్ఫుల్ లైనప్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు ప్రొడక్షన్ లో ఈ మూవీ ఉండబోతుంది. గేమ్ చేంజర్ టైటిల్ ఈ మూవీకి ఫిక్స్ చేశారు. ఇదిలా ఉంటే దీని తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేయనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.

ఈ మూవీ రామ్ చరణ్ 16వ సినిమాగా ఉండబోతుంది. దీని తర్వాత రామ్ చరణ్ లిస్టులో భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయని చెప్పాలి. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాని కన్నడ యంగ్ డైరెక్టర్ నర్తన్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతుంది అని టాక్ వినిపిస్తుంది. దీని తర్వాత డీవీవీ దానయ్య ప్రొడక్షన్ లో రామ్ చరణ్ 18వ సినిమా తెరకెక్కుతుంది.

ఈ సినిమా కూడా ఓ స్టార్ దర్శకుడితోనే ఉంటుంది అని తెలుస్తుంది. తాజాగా రామ్ చరణ్ కి యూవీ క్రియేషన్స్ ఒక పోస్టర్ తో బర్త్ డే విషెస్ చెప్పింది. అలాగే డీవీవీ దానయ్య కూడా పోస్టర్ తో విశేష్ చెప్పారు. దీంతో ఈ రెండు నిర్మాణ సంస్థలలో రామ్ చరణ్ సినిమాలు ఉన్నాయనేది కన్ఫర్మ్ అయ్యింది.

ఇదిలా ఉంటే శంకర్ మూవీ కంప్లీట్ చేసిన తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమాని చెర్రి సెట్స్ పైకి తీసుకొని వెళ్ళనున్నాడు. ఈ మూవీలో పాత్ర రంగస్థలంలో చిట్టిబాబు కంటే అద్భుతంగా ఉంటుంది అని ఇప్పటికే చరణ్ చెప్పాడు.

దీంతో ఆ మూవీపైన కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక గ్లోబల్ స్టార్ ఇమేజ్ తో రామ్ చరణ్ ఈ సినిమాలు చేస్తూ ఉండటంతో కథ, కథనాల విషయంలో ఆ ఆ ఇమేజ్ ని మరింత ముందుకి తీసుకెళ్ళేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక హాలీవుడ్ మూవీ కూడా ఈ ఏడాదిలో ఎనౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.