Ram Charan: టాలీవుడ్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీగా అంచనాలు నెల కొన్నాయి. ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. అలాగే ఇప్పటికే ఈ మూవీ విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ తెగ ఆకట్టుకున్నాయి. ఇకపోతే ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే.
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న పెద్ది సినిమా వచ్చే ఏడాది మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ షూటింగ్ పూణేలో జరుగుతోంది. ఈ కొత్త షెడ్యూల్ లో రామ్ చరణ్ తో పాటు జాన్వీ కపూర్ కూడా పాల్గొంటోంది. హీరో,హీరోయిన్లపై ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ పాటకు సంబంధించిన ఒక చిన్న వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
Bro takes risks like rusk 🙌
No contemporary hero is even willing to shoot outdoors but you are a mad man @AlwaysRamCharan 💪🙏 pic.twitter.com/zm8zivkydU
— Doctordeath☠ (@yugeshroyal1) October 10, 2025
ఇందులో హీరో రామ్ చరణ్ ఒక ఎత్తైన కొండ ప్రాంతంలో డ్యాన్స్ వేస్తూ కనిపించాడు. చూస్తుంటే ఇది చాలా రిస్కీ సీన్ లా కనిపిస్తోంది. ఎందుకంటే చుట్టూరా లోతైన లోయ, అందులోనూ ఎండిపోయిన చెట్టు కొమ్మపై ఒక కాలు, మరో కాలు బండరాయిపై ఉంచి తన బాడీని బ్యాలెన్స్ చేస్తూ ఈ స్టెప్పలేస్తున్నాడు చెర్రీ. ప్రస్తుతం పెద్ది సాంగ్ షూట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ డెడికేషన్ అండ్ డేరింగ్ కు ఫిదా అవుతున్నారు. రామ్ చరణ్ రియల్ హీరో అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అదే సమయంలో కొందరు అన్నా జాగ్రత్త అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
