రామ్ చరణ్, ప్రియాంక స్పెషల్ పార్టీ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఇక ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్కార్ కోసం వచ్చిన సెలబ్రిటీలకు ప్రీ ఆస్కార్ పార్టీకి గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హోస్ట్ గా వ్యవహరించింది.

ఇక ఈ పార్టీకి దక్షిణాసియా ఫిలీం ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. వారిలో రామ్ చరణ్, ఉపాసన, ఎన్టీఆర్, ప్రీతి జింతా, జాక్వెలెన్ ఫెర్నాండేజ్, సెంథిల్ తదితరులు ఉన్నారు. ఇక ప్రియాంక చోప్రాకు, రామ్ చరణ్ వీరిద్దరు కలిసి జంజీర్ సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రామ్ చరణ్ కు అంతగా కలిసి రాలేదు. ఎన్నో ఆశలతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా మాత్రం డిజాస్టర్ గా మిగిలిపోయింది.

ఇక ఈ పార్టీలో రామ్ చరణ్ దంపతులతో కలిసి ప్రియాంక చోప్రా స్పెషల్ ఫొటూ షూట్ చేసింది. ఆ ఫొటోలను ఉపాసన తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. సౌత్ ఇండస్ట్రీ ప్రముఖులతో ప్రియాంక చోప్రా కలిసి ఫొటోస్ దిగడం ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

ఇక ఈ పార్టీలో మిషన్ ఇంపాజిబుల్ 3, స్టార్ వార్స్, సూపర్ 8 వంటి బిగ్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ జేజే అబ్రమ్స్ ను రామ్ చరణ్ కలిశారు. అతనితో ఉన్న ఫ్యాన్ బాయ్ మూమెంట్ ను షేర్ చేసుకున్నాడు. ఇక ఈ ఫొటోస్ నెట్టింటా వైరల్ గా మారాయి. ఇక ఇదిలా ఉంటే జేజే అబ్రమ్స్ దర్శకత్వమ్ లో చెర్రీ మూవీ వస్తుందని ఇటీవల ప్రకటించారు. ఇక ఆస్కార్ అవార్డు 2020 వేడుక మార్చి 12 న ఘనంగా నిర్వహించనున్నారు. ఇక భారత కాలమానం ప్రకారం మార్చి 13 న 5.30 నిముషాలకు ఈ వేడుక జరగనుంది. నాటు నాటు పాటకు… ఆస్కార్ రావాలని మనమూ కోరుకుందాం.