హాలీవుడ్ ప్రాజెక్ట్ పట్టుకొచ్చిన రామ్ చరణ్.!

అమెరికాలో ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ఆస్కార్ హంగామా ముగిసింది. ‘ఆస్కార్’ని తీసుకొచ్చేశారు కూడా.! అంతేనా.? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాస్తా గ్లోబల్ స్టార్.. ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు.! అదెలా.? కేవలం ప్రచారం మాత్రమే కాదు, రామ్ చరణ్ ఓ హాలీవుడ్ సినిమాలో నటించబోతున్నాడట.

ఈ విషయమై అధికారిక ప్రకటన అతి త్వరలో రాబోతోందన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆస్కార్ సంబరాల క్రమంలోనే రామ్ చరణ్, ఓ మాలీవుడ్ ప్రాజెక్టుని పట్టుకున్నాడట. ఓ హాలీవుడ్ ఫిలిం మేకర్ రామ్ చరణ్‌తో ప్రాథమిక ఒప్పందం చేసుకున్నారని కూడా తెలుస్తోంది. అయితే, ఈ విషయమై రామ్ చరణ్ ఇంకా పెదవి విప్పాల్సి వుంది.

మరి, యంగ్ టైగర్ ఎన్టీయార్ సంగతేంటి.? ఎన్టీయార్ ఇంకాస్త కష్టపడాల్సి వుంది. ముందుగా జాతీయ స్థాయిలో ఎన్టీయార్ సరైన గుర్తింపు పొందాల్సి వుంది.