మెగా హీరోలంటే అందరికీ ఓ అంచనాలుంటాయి. మాస్ హీరోగా ఎదిగేందుకే పరితపిస్తుంటారనే ముద్ర ఉంటుంది. కానీ వరుణ్ తేజ్ వచ్చి ఆ మాటను బ్రేక్ చేశాడు. ప్రయోగాలు చేయడం, కొత్త కథలు ఎంచుకోవడంలో ముందుంటాడు. అలా ఇప్పుడు వైష్ణవ్ తేజ్ కూడా తన మొదటి చిత్రంలో కొత్త కథకు ప్రాణం పోశాడు. అయితే వైష్ణవ్ తేజ్ ఇలా ఇంత గొప్పగా నటించడం, ఇంతగా సక్సెస్ అందుకోవడం గురించి రామ్ చరణ్ చెబుతూ.. పర్సనల్ విషయాలను కూడా పంచుకున్నాడు.
పైకి ఇలా నవ్వుతూ.. మొహమాటంగా సిగ్గుపడుతూ ఉంటాడు.. కానీ అస్సలు నమ్మకండి.. వాడు మామూలోడు కాదు.. వాడి లోపల అగ్ని పర్వతం ఉంటుంది.. అలా ఉంది కాబట్టి.. మొదటి సినిమాలోనే ఇలా పర్ఫామెన్స్ ఇచ్చాడు.. ఇలా నేను నటించడానికి దాదాపు ఆరేడు సినిమాలు పట్టింది. కానీ వాడు మొదటి సినిమాలోనే ఇలా నటించేశాడంటూ మామూలు విషయం కాదు. డెబ్యూటెంట్ హీరోకే 50 60 అనే నంబర్లు వినడం మామూలు విషయం కాదు.
ఇంట్లో నాకు, తేజుకూ కూడా లెక్చరర్స్ ఇస్తుంటాడు.. మా అందరిలోకెల్లా వీడికే ఎక్కువగా మెంటల్ బ్యాలెన్స్ ఉంది.. ఎక్కువగా ఆలోచిస్తుంటాడు.. బ్యాలెన్స్డ్‌గా మాట్లాడుతుంటాడు.. ఇలాంటి వాడికి సక్సెస్ రావడం పెద్ద విషయం ఏమీ కాదు.. ఇలా సక్సెస్ అవుతాడని మాకు ముందే తెలుసు.. నా సినిమాకు కూడా మా నాన్న అంత సమయం కేటాయిస్తాడో లేదో కానీ.. ఉప్పెన కథను నాలుగు సార్లు విన్నాడు.. అంత టైం కేటాయించారంటూ రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు.