Pothineni Ram : యూట్యూబ్ ని అదరగొడుతున్న రామ్ – కృతి ల బుల్లెట్ సాంగ్..!

Pothineni Ram : ఇస్మార్ట్ శంకర్, రెడ్ వంటి సినిమాల తర్వాత రామ్ పోతినేని నటిస్తున్న సినిమా ది వారియర్.. సింగం సిరీస్ ల దర్శకుడు లింగుస్వామి మొదటిసారి రామ్ కాంబినేషన్ లో ఈ సినిమా వస్తోంది.ఈ సినిమాలో రామ్ పోతినేని సరసన హీరోయిన్ గా ఉప్పెన సినిమా తో అందరినీ ఆకట్టుకున్న కృతి శెట్టి నటిస్తోంది.ది వారియర్ సినిమాలో మొదటిసారి రామ్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా ప్రమోషన్ కార్యక్రమాలు చిత్రబృందం అప్పుడే మొదలు పెట్టేసారు.

తమిళ్, తెలుగు ద్విభాషా చిత్రంగా వస్తున్న ఈ సినిమాలో శింబు తన గొంతు సవరించుకున్నాడు అన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో బుల్లెట్ సాంగ్ ని శింబు పాడాడు.ఇటీవల ఆ పాటకు సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. మంచి మాస్ బీట్ తో ఈ పాట ఉండబోతోంది అని ప్రమోతోనే అర్థం అయిపొయింది.

తాజాగా ఈ మూవీ లోని బుల్లెట్ సాంగ్ శుక్రవారం విడుదలై యూట్యూబ్ లో దుమ్ములేపుతుంది.దేవి శ్రీ ఈ సినిమాకు మరో సారి అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వగా,శేఖర్ మాస్టర్ ఈ సాంగ్ కు కొరియోగ్రఫీ చేసాడు. రామ్ – కృతి శెట్టి లు ఇద్దరు కూడా స్టెప్పులతో అదరగొట్టారు.జులై 14 న ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నారు.