Ram pothineni : మతిమరుపుతో బాధపడుతున్న ఆ యంగ్ హీరో… ఎవరో తెలుసా..?

Ram Pothineni : ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని వరుస సినిమాలతో యమ జోష్ మీద ఉన్నాడు. ఇస్మార్ట్ శంకర్ తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిన హైపర్ హీరో రెడ్ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలోకి వేసుకున్నాడు. ఇక తమిళ దర్శకుడు లింగస్వామి దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో మాస్ ఎంటర్టైనర్ తో వస్తున్నాడు ఎలా వరుస పెట్టి సినిమాలు తీస్తూ అభిమానుల్లో జోష్ పెంచేసాడు రామ్.

తాజాగా నటిస్తున్న లింగస్వామి దర్శకత్వంలోని సినిమాలో మతిమరుపు వ్యాధితో ఉండే పాత్రలో రామ్ నటించనున్నాడు. అదీకాక పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. ఈ జబ్బుతో సినిమాలో తాను పండించే కామెడీ హైలైట్ గా నిలవనుందని సమాచారం.ఇక ఆ జబ్బు తాలూకు సమస్యలను ఎలా పరిష్కరించుకున్నాడాన్నదే సినిమా కథ.రామ్ కామెడీ టైమింగ్ చాలా విభిన్నంగా ఉంటూ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. రెడీ, కందిరీగ, మసాలా, వంటి సినిమాల్లో తన కామెడీ చాలా బాగుంటుంది.

ఇకపోతే ఈ సినిమాలో రామ్ సరసన ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి నటిస్తుండగా.. దానితో పాటు విలన్ గా యంగ్ హీరో ఆది పినిశెట్టి నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా నుంచి రామ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల ఈ భారీ రెస్పాన్స్ ని అందుకుంది ఈ సినిమాకోసం రామ్ సరికొత్త మేకోవర్ తో రాబోతున్నాడు శరవేగంగా షూటింగ్ ఇప్పటికే జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ఒక న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.ఇకపోతే చివరికి ఒక కేసులో ఈ మతిమరుపు వలన రామ్ చేసిన పొరపాటు ఏంటి..? ఇక దాన్ని ఎలా సరిదిద్దుకున్నాడు అనేది కథగా తెలుస్తోంది. అంతేకాదు కామెడీ చేయడంలో రామ్ రూటే వేరు.. రెడీ, కందిరీగ చిత్రాల్లో రామ్ కామెడీ అల్టిమేట్ అని చెప్పాలి. అయితే మరి ఈ సినిమాలో పోలీసాఫీసర్ గా రామ్ ఏ విధంగా కామెడీ చేస్తాడో చూడాలి.