మెగా ఛాన్స్ కొట్టేసిన రకుల్.!

రకుల్ ప్రీత్ సింగ్‌ని ఓ మెగా ఆఫర్ పలకరించిందట. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో గతంలో పలు చిత్రాల్లో నటించింది రకుల్ ప్రీత్ సింగ్. అలాగే అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ తదితర మెగా కాంపౌండ్ హీరోలతోనూ స్ర్కీన్ షేర్ చేసుకుంది.

లేటెస్ట్‌గా రకుల్ నటించిన మెగా మూవీ ‘కొండపొలం’ జాతీయ అవార్డు దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే, తెలుగులో రకుల్ ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయడం లేదు. బాలీవుడ్‌లో కంటెంట్ రిచ్ మూవీస్‌ని సెలెక్ట్ చేసుకుంటూ బిజీగా గడుపుతోంది.

తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం, మెగాస్టార్ చిరంజీవి సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోందట. అయితే, హీరోయిన్‌గా కాదండోయ్. వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ స్టన్నింగ్ రోల్ కోసం రకుల్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయట. రకుల్ కూడా అందుకు సుముఖంగానే వుందట. ఇదో కీలకమైన పాత్రనీ తెలుస్తోంది.

గతంలో నితిన్ నటించిన ‘చదరంగం’ సినిమాలో రకుల్ లాయర్‌గా ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించింది. సినిమా హిట్టవ్వలేదు కానీ, రకుల్ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

నిజానికి ఎలాంటి హుందా అయిన పాత్రనైనా రకుల్ ట్యాకిల్ చేయగలదు. అదీ మెగాస్టార్ సినిమాలో అంటే.. ఇక మరీ రెచ్చిపోతుంది. చూడాలి మరి, ఆ పాత్ర ఏంటో.! రకుల్ దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోనుందో.!