రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. తప్పుడు వార్తలపై, రూమర్లపై, సమాజంలో జరిగే అన్యాయాలపై గొంతెత్తుంది. ఆ మధ్య లాక్ డౌన్‌లో తనపై వచ్చిన రూమర్లను తెలివిగా ఖండించాడు. మెడికల్ షాప్‌కు వెళ్లి వస్తోన్న రకుల్ను చూసి.. మద్యం కొనడానికి వెళ్లింది అంటూ తప్పుగా రాసిన సదరు వెబ్ సైట్‌కు కౌంటర్ వేసిన సంగతి తెలిసిందే.
తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ఓ విషయంపై తీవ్ర స్థాయిలో మండిపడింది. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ అత్యాచారాల కేంద్రంగా తయారైనట్టు కనిపిస్తోంది. రోజుకో అత్యాచార ఘటన జరగడం అందర్నీ కలవరపెడుతోంది. తాజాగా ఓ మూడేళ్ల బాలికపై దుండగలు అత్యాచరం జరిపి, హత్య చేశారు. గడిచిన ఇరవై రోజుల్లో ఇది మూడో ఘటన. వరుసగా ఇలాంటి ఘటనలు సంభవిస్తుండటంపై రకుల్ ప్రీత్ సింగ్ ఆవేదన చెందింది.
అత్యాచార వార్తలపై స్పందిస్తూ.. చీచీ ఇది సిగ్గుచేటు ఎంతటి అసహ్యకరం.. వీటికి అంతం ఎప్పుడు.. ఎలా ఆపగలం అంటూ ఫైర్ అయింది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ చేసిన కామెంట్స్‌కు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం షూటింగ్‌లో బిజీగా ఉంది. వికారాబాద్ అడవుల్లో రకుల్ షూటింగ్‌లో పాల్గొంటోంది. ఇక నిత్యం రెండు మూడు కిలో మీటర్లు నడుస్తున్నానని, గుట్టలు ఎక్కుతున్నానని తన కష్టాల గురించి చెప్పుకొస్తుంది.