తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. సినిమా జయాపజయాలతో నిమిత్తం లేకుండా ఆమె మూవీ కెరీర్ సాగిపోతోంది. తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ భాషలలో కూడా అమ్మడు అడపా దడపా సినిమాలు చేస్తుంటుంది. మూవీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి మీద ఏదొక రూమర్ బయటకి వస్తుంది. రకుల్ వ్యక్తిగత జీవితం కూడా ఇటీవలి కాలంలో వివాదాస్పదంగా మారింది. ఆమెపై వచ్చినన్ని పుకార్లు, వార్తలు మరే హీరోయిన్‌పై కూడా రాలేదేమో . అజ్ఞాత వ్యక్తి ఆమెకు ఇల్లు గిఫ్టుగా ఇచ్చాడంటూ పలు రకాల కథనాలు మీడియా మరియు సోషల్ మీడియాలో చక్కెరలు కొట్టాయి.ఇక తాజా బాలీవుడ్ డ్రగ్స్ కేసు అంశం అయితే రకుల్ ని బాగా ఇబ్బంది పెట్టింది.
తనపై వచ్చిన రూమర్స్ కి రకుల్ ప్రీత్ సింగ్ ,సమంతా సాక్షిగా సమాధానమిచ్చారు. ‘అక్కినేని సమంతా’ వ్యాఖ్యాతగా ‘ఆహా’ ఓటిటి ప్లాట్ ఫామ్ లో “సామ్ జామ్” అనే షో చేస్తున్నారు. తన మీద వచ్చిన పుకార్లకు రకుల్ సమాధానమిస్తుందా అని సమంతా అడగగా రకుల్ ఓపెన్ అయ్యి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. పుకార్లు పుట్టించి ప్రచారం చేసేవారు అసలు ఎలాంటి ఆలోచన అవాగాహన లేకుండా చేసేస్తున్నారు. నేను కష్టపడి సంపాదించి కొనుకున్న ఇంటిని నాకు ఎవరో ఒకతను గిఫ్ట్ గా ఇచ్చారని కూడా ప్రచారం చేశారు. అలా గిఫ్ట్ లు ఇచ్చేవారు ఉన్నట్లయితే నేను ఎందుకు ఈ విధంగా కష్టపడతాను. ఇలాంటి వివాదాలన్నిటికి నేను సమాధానం ఇవ్వాలనుకోవటంలేదు, నా పని వారికి సమాధానం ఇవ్వాలని కోరుకుంటున్నానని రకుల్ చాలా ఉన్నతంగా చెప్పుకొచ్చారు.