తెలుగు సినిమా సహా తమిళ సినిమా దగ్గర భారీ క్రేజ్ ఉన్నటువంటి స్టార్ హీరోలు నందమూరి నటసింహ నందమూరి బాలకృష్ణ కాగా మరొకరు అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ అని చెప్పాలి. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమన్నా ఉంది అంటే అది రజిని మరియు నందమూరి బాలకృష్ణ సహా నారా చంద్రబాబు నాయుడు లకి ఉన్న అనుబంధం అని చెప్పాలి.
అప్పట్లో దాదాపు రెండు దశాబ్దాల కితం నుంచే వారికి మంచి అనుబంధం ఉండగా ఇప్పుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు 100 ఏళ్ల జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక కార్యక్రమానికి అయితే రజినీకాంత్ స్పెషల్ గెస్ట్ గా హైదరాబాద్ కి వచ్చారు.
కాగా ఈ మీటింగ్ లో రజినీకాంత్ చేసిన అనేక కామెంట్ ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ అవుతుండగా సినిమా పరంగా అయితే బాలయ్య పై తాను చేసిన కామెంట్స్ వైరల్ ఒకింత ఫన్నీ గా మారాయి. బాలయ్య సినిమాల్లో ఫైట్ లు గాని కొన్ని ఫీట్ లు గాని ఎంత ఓవర్ అండ్ క్రింజ్ గా ఉంటాయో తెలిసిందే.
మరి వాటిపై రజిని మాట్లాడుతూ బాలయ్య గారు మీరు చేసే లాంటి యాక్షన్ నేను గాని అమీర్ ఖాన్ గాని అమితాబ్ లాటి వారు ఎవరు చేసినా కూడా జనం యాక్సెప్ట్ చెయ్యరు. కానీ మీరు చేస్తే మాత్రం ఒప్పుకుంటారు అదే మీ గొప్పతనం అన్నట్టుగా మాట్లాడారు. దీనితో అయితే తలైవర్ బాలయ్యని పొగిడినట్టా లేక ట్రోల్ చేసినట్టా అని అంతా అనుకుంటున్నారు. అయితే బాలయ్య ని తాను అన్నా రజిని సినిమాలో ఎన్నో ఓవర్ సీన్స్ ఉన్నాయి వాటిని మర్చిపోతే ఎలా అని మరికొందరు అంటున్నారు.