KGF 2: కేజీఎఫ్ 2 పై షాకింగ్ కామెంట్స్ చేసిన సూపర్ స్టార్ రజనీ కాంత్..!నిర్మాతకు కాల్ చేసి ఏమన్నారో తెలుసా..?

KGF 2: ఆర్ఆర్ఆర్ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో ప్రస్తుతం వినిపిస్తున్న పేరు కేజీఎఫ్ 2. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో యశ్ నటించిన విషయం తెలిసిందే. ఒక్క సినిమాతో కన్నడ ఇండస్ట్రీ స్థాయిని ఎక్కడికో తీసుకెళ్ళారు. ఇంత వరకూ కొన్ని సినిమాల్లో నటించినా యశ్ కి కూడా ఈ సినిమాతోనే ఎవరూ ఊహించని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకున్నారు. చాప్టర్ 1 భారీ హిట్ కావడంతో, అదే ఉత్సాహంతో ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్ 2 మరోసారి ప్రేక్షకులను అలరించడానికి యశ్ సిద్దమయ్యాడు.

ఇకపోతే ఇటీవలే విడుదలైన ఈ సినిమాకు అనుకున్న విధంగానే భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ కంటే ఎక్కువగా వసూళ్లను రాబట్టి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ తన సత్తాను చాటుతోంది. విడుదలై వారం రోజులు కూడా కాకముందే కోట్లలో కలెక్షన్స్ వసూలు చేసి, అందరి మన్ననలు పొందుతోంది.

ఇకపోతే ఇప్పటికే విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ ట్రెండింగ్ లో నిలిచిన కేజీఎఫ్ సినిమాను చూసిన పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా పలువురు సెలబ్రిటీలు సైతం మూవీ టీమ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో సూపర్ స్టార్ రజనీ కాంత్ కూడా చేరి, ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏ సినిమా అయినా నచ్చితే ఆయనే స్వయంగా ఆ మూవీ నిర్మాతకు, దర్శకుడికి ఫోన్ చేసి మరీ అభినందించే వ్యక్తిత్వం ఉన్న రజనీ, ఈ సారి కూడా తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు. కేజీఎఫ్ మూవీ నిర్మాతకు కాల్ చేసి మెచ్చుకున్నారని సమాచారం. ఈ సినిమా బాగా తీశారని అందర్నీ ప్రశంసించినట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇక రజనీ కాంత్ విషయానిస్తే ప్రస్తుతం చేతిలో రెండు సినిమాలు ఉన్నట్టు సినీ వర్గాల సమాచారం.