ప్రాజెక్ట్‌ ‘జైలర్‌ 2’….. వర్క్‌మోడ్‌లో ఇళయరాజా

తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి కోలీవుడ్‌ డైరెక్టర్‌ నెల్సన్‌ దిలీప్‌కుమార్‌తో చేయబోతున్న సీక్వెల్‌ ప్రాజెక్ట్‌ జైలర్‌ 2. ఇప్పటికే కూలీ షూటింగ్‌లో బిజీగా ఉన్న తలైవా ఇక జైలర్‌ 2 చిత్రీకరణలో కూడా పాల్గొనబోతున్నాడు.

తలైవా పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్‌ 12న జైలర్‌ 2 ప్రోమో రాబోతుందని తెలిసిందే. ఈ నేపథ్యంలో రజినీకాంత్‌ ఇళయరాజాతో కలిసి దిగిన ఫొటో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. తలైవా ప్రోమో షూట్‌ కోసం ఈవీపీ ఫిలిం సిటీకి వెళ్తుండగా ఈ ఫొటో దిగారు. బర్త్‌ డేన కూలీ న్యూ లుక్‌ పోస్టర్‌ కూడా విడుదల చేసేందుకు రెడీ అవుతున్నట్టు ఇన్‌సైడ్‌ టాక్‌.

జైలర్‌ 2 స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయిందని నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. జైలర్‌ ఫస్ట్‌ పార్టులో రమ్యకృష్ణ, వినాయకన్‌, వసంత్‌ రవి , మోహన్‌ లాల్‌, శివరాజ్‌ కుమార్‌, తమన్నా కీలక పాత్రల్లో నటించగా.. సీక్వెల్‌లోని పాత్రలపై క్లారిటీ రావాల్సి ఉంది. రజినీకాంత్‌ లోకేశ్‌ కనగరాజ్‌ డైరెక్షన్‌లో చేస్తున్న కూలీ 2025లో గ్రాండ్‌గా విడుదల కానుంది.