క్రేజీ అప్డేట్ : రజినీ సినిమాలో తన సెన్సేషనల్ సూపర్ హిట్ లేడీ విలన్..?

తమిళ నాట వన్ అండ్ ఓన్లీ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎవరన్నా ఉన్నారు అంటే అది థలైవర్ రజినీకాంత్ అనే చెప్తారు అంతా.. మరి ఇలాంటి రజిని స్టార్డం కి తగ్గ భారీ హిట్ అయితే ఇంకా పడలేదు. దీనితో బాక్సాఫీస్ దగ్గర రజిని దెబ్బ కొడితే ఎలా ఉంటుందో చూడాలని మూవీ లవర్స్ కూడా ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు.

ఇక ఇప్పుడు అంతా కూడా తన లేటెస్ట్ చిత్రం “జైలర్” పైనే ఆశలు పెట్టుకున్నారు. ఇక ఈ చిత్రాన్ని తమిళ నాట సూపర్ హిట్ సినిమాలు “డాక్టర్” లేటెస్ట్ గా “బీస్ట్” దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో భారీ ఏక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమాని చేస్తున్నారు. మరి ఈ సినిమాలో కాస్ట్ కూడా ఎప్పటికపుడు క్రేజీ గా వినిపిస్తుంది.

మరి అలా ఇప్పుడు ఈ చిత్రంలో ఓ ఊహించని సీనియర్ స్టార్ హీరోయిన్ అందులోని రజినీ లేడీ విలన్ కీలక పాత్రలో నటించనున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. మరి ఆమె ఎవరో కాదు రమ్య కృష్ణ అట. ఈ సెన్సేషనల్ కాంబోలో వచ్చిన “నరసింహా” సినిమాని అంత తేలిగ్గా ఎవరూ మర్చిపోరు.

ఇక ఫైనల్ గా ఈ అదిరిపోయే కాంబో మళ్ళీ జైలర్ తో రిపీట్ కాబోతుంది అని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే దర్శకుడు నెల్సన్ మాత్రం సినిమాని వేరే లెవెల్లోకి తీసుకెళ్తున్నాడని చెప్పొచ్చు. మరి ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ వాళ్ళే నిర్మాణం అందిస్తున్నారు.