సెన్సేషనల్ కాస్టింగ్ తో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా రజినీ 170వ చిత్రం 

ఇప్పుడు తమిళ సినిమా సహా సౌత్ ఇండియా సినిమా దగ్గర కూడా మంచి హైప్ అండ్ బజ్ ని క్రియేట్ చేస్తున్న భారీ చిత్రం ఏదైనా ఉంది అంటే అది సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ చిత్రం “జైలర్” అనే చెప్పాలి. కాగా ఈ చిత్రం తర్వాత ఐతే రజిని లైనప్ మరింత భారీగా వెళ్తుండగా ఈ చిత్రాల్లో తన కెరీర్ 170 వ సినిమాపై ఎప్పటికప్పుడు ఓ రేంజ్ లో న్యూస్ లు వినిపిస్తున్నాయి.

మరి ఈ 170 వ సినిమాపై లేటెస్ట్ క్రేజీ గాసిప్ ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. కాగా ఈ చిత్రాన్ని తమిళ సెన్సేషనల్ హిట్ దర్శకుడు టీజీ జ్ఞ్యానవేల్ ముత్తు తెరకెక్కించనుండగా ఈ సినిమా కూడా రియల్ ఇన్సిడెంట్ లు ఆధారంగా తెరకెక్కిస్తున్నారని టాక్ వచ్చింది.

అయితే ఇదే సినిమాలో నాచురల్ స్టార్ నాని కూడా ఉన్నాడని ఆ మధ్య టాక్ రాగా లేటెస్ట్ గా అయితే ఇంకా మరింత మంది బిగ్ స్టార్స్ ఈ చిత్రాల్లో నటిస్తున్నారని తెలుస్తుంది. కాగా ఈ చిత్రానికి పాన్ ఇండియా వైడ్ ఒక్కో స్టార్ నటుడు కనిపిస్తాడట. అలా మన తెలుగు నుంచి నాని లాక్ అవ్వగా తమిళ్ నుంచి రజిని ఎలాగో ఉన్నారు ఇక మళయాళం నుంచి వెర్సటైల్ నటుడు ఫహద్ ఫాజిల్ అలాగే మంజు వారియర్ లు నటిస్తారట.

ఇక దీనితో పాటుగా బాలీవుడ్ నుంచి బిగ్ బి అమితాబ్ బచ్చన్ లు లాక్ అయ్యారట. దీనితో ఇండియన్ సినిమా దగ్గర ఇంట్రెస్టింగ్ అండ్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రం లోడింగ్ లో ఉందని చెప్పాలి. కాగా ఈ సెన్సేషనల్ కాస్టింగ్ పై రానున్న రోజుల్లో అధికారిక ప్రకటన కూడా రానుంది.