MS Chowdary: ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలా ఇబ్బందులు పడ్డానని, ఫ్రెండ్స్ అంతా కొంచెం సన్నబడమని కూడా సలహా ఇచ్చేవారని ఆర్టిస్ట్ ఎమ్.ఎస్. చౌదరి తెలిపారు. కానీ నిజం చెప్పాలంటే సన్నగా ఉన్నపుడు పెద్ద క్యారెక్టర్ అసలు చేయలేదని, లావు అయ్యాకనే తనకు మంచి క్యారెక్టర్స్ వచ్చాయని ఆయన చెప్పారు. ప్రతీ ఒక్కరూ సిక్స్‌ప్యాక్‌లతో ఎలా ఉంటారు.. మనషులు పాత్రల్లా కనిపించాలి కానీ, అందరూ పెద్ద వీరుల్లాగా చిన్న పాత్ర వేసే దగ్గర్నుంచీ అందరూ స్లిమ్‌గా తయారవడం లేదా సిక్స్‌ప్యాక్‌లు పెంచేసి కండలు తిరిగడం అనుకుంటున్నారని ఆయన అన్నారు.
కానీ సినిమా అంటే కథ కదా.. కథలో సమాజ పరిస్థితులు కనిపించాలి కదా.. అంతే గానీ సినిమా అనగానే దాంట్లో జిమ్ కనబడాలా అని చౌదరి ప్రశ్నించారు. జిమ్ కాదు కదా మనకు కనబడాల్సింది… వీడు సిక్స్‌ప్యాక్, వాడు 8 ప్యాక్.. ఇంకోటి అని ఏదో అనుకుంటున్నారని ఆయన అన్నారు. వీటి మీద పెట్టే బదులు యాక్టింగ్ మీద పెట్టాలని తన ఫీలింగ్ అని ఆయన చెప్పారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.. కానీ ఇలా కాదు అని ఆయన తెలిపారు.
పాత హీరోలున్నారు కదా.. ఎన్టీఆర్ లాంటి వారు జిమ్‌కి వెళ్లేవారా.. కానీ ఆరోగ్యాన్ని కాపాడుకునే వ్యాయామం మాత్రం చేసేవారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆయన నటిస్తే అక్కడ పాత్రే కనిపించేది అని ఆయన చెప్పారు. ఆయన కూడా సిక్స్‌ప్యాక్ చేసి ఉంటే కృష్ణుడిలా చేసేవారా అని ఆయన చెప్పారు. ఇప్పుడు నాని గారిని చూస్తే సాదాసీదాగా ఉంటారని, ఏ పాత్ర చేస్తే ఆ పాత్ర మనకు ఓ పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాడని అందరూ అంటారని ఆయన అన్నారు. అంతే గానీ జిమ్‌కి వెళ్లి సిక్స్‌ప్యాక్ చేయడమే కాదు యాక్టింగ్‌పైన కూడా ఫోకస్ చేయాలని ఆయన చెప్పారు.
ఇకపోతే రాజీవ్ కనకాల తనను ఓ సారి కలిసినపుడు మొదట తనను గుర్తుపట్టలేదు.. కానీ పేరు చెప్పగానే గుర్తుపట్టారని చౌదరి చెప్పారు. అలా ఒక షూటింగ్ స్పాట్‌లో కూడా తనతో చేయడం నిజంగా చాలా అదృష్టం అని అన్నట్టు కూడా ఆయన తెలిపారు. తనకు ఇప్పటివరకు 17 సార్లు నంది అవార్డులు వచ్చాయని చెప్పగానే ఆయన తన కాళ్లను పట్టుకునే ప్రయత్నం చేశారని ఆయన చెప్పారు. అయ్యో ఏంటీ సర్ అని అంటే.. లేదు భయ్యా నాకు ఒక్క అవార్డు కూడా లేదు అని ఆయన అంటే.. వాళ్లు మీకు అవార్డు ఇవ్వకపోయినా మీకు ప్రక్షకులను ఎప్పుడో గెలుచుకున్నారని తాను చెప్పినట్టు చౌదరి వివరించారు.