RRR సీక్వెల్ కోసం రాజమౌళి వారసుడు?

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ పీరియాడికల్ ఫ్రీడం ఫైట్ బ్యాక్ డ్రాప్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ఇండియా నుంచి మొదటి ఆస్కార్ అవార్డు అందుకున్న చిత్రంగా కూడా ఆర్ఆర్ఆర్ నిలిచిందని చెప్పాలి.

ఇప్పటివరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఏ ఒక్కరికి దక్కని గౌరవం ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళికి సొంతమైంది. ఈ సినిమాతో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరు కూడా పాన్ ఇండియా లెవెల్ సినిమాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ సినిమాకి సీక్వెల్ చేసే ప్లాన్ ఉన్నట్లు గతంలోనే దర్శకుడు రాజమౌళి చెప్పారు.

సీక్వెల్ కి సంబంధించి ఒక స్టోరీ లైన్ కూడా అనుకున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అది ఎప్పుడు ఉంటుంది అనే విషయం పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా విజయేంద్రప్రసాద్ మరోసారి ఆర్ఆర్ఆర్ సినిమా సీక్వెల్ పై ఓ మీడియా ఇంటర్వ్యూలో రియాక్ట్ అయ్యారు. ఈ మూవీని సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కంప్లీట్ చేసిన తర్వాత ప్లాన్ చేయనున్నట్లు చెప్పారు.

అయితే దానికి రాజమౌళి దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే చేసే అవకాశం ఉందని అన్నారు. రాజమౌళి ఇన్వాల్వ్ మెంట్ ఉన్న డైరెక్షన్ చేసేది మాత్రం వేరొకరని అన్నారు. అయితే ఎవరు దర్శకత్వం చేస్తారనేది చెప్పలేదు. తాజాగా సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ 2కి సంబంధించి ఇంటరెస్టింగ్ టాక్ ప్రచారంలోకి వచ్చింది. ఈ సీక్వెల్ ని రాజమౌళి తనయుడు కార్తికేయ డైరెక్షన్ చేస్తారనే మాట వినిపిస్తోంది.

బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలకి సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా కార్తికేయ చేసిన అనుభవం ఉంది. సినిమాలో కొన్ని సీక్వెన్స్ ని కార్తికేయనే తెరకెక్కించారంట. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ 2తో కార్తికేయ నుంచి పూర్తిస్థాయి దర్శకుడిగా మార్చడానికి రాజమౌళి సిద్ధం అవుతున్నారంట. దానికి ఇప్పటికే స్టొరీ సిద్ధమైందని టాక్.

ఎన్టీఆర్, రామ్ చరణ్ డేట్స్ బట్టి సరైన టైమ్ చూసుకొని ఈ సీక్వెల్ మూవీని ఎనౌన్స్ చేసే అవకాశం ఉందంట. అలాగే ఈ మూవీ కోసం మరో పేరు కూడా వినిపిస్తోంది. బ్రహ్మాస్త్ర మూవీ చేసిన అయాన్ ముఖర్జీ మేకింగ్ పై గతంలో జక్కన్న ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో ఆయన దర్శకత్వంలో అయిన ఆర్ఆర్ఆర్ 2 ఉండొచ్చనే మాట ప్రచారంలో ఉంది.