ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన రాజమౌళి.. ఇది అందరికీ షాకే..?

ఆర్ ఆర్ ఆర్ … యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోలుగా నటిస్తున్న భారీ మల్టీస్టారర్. బాహుబలి తర్వాత ఇండియన్ స్క్రీన్ మీద మరో అద్భుతాన్ని చూపించబోతున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. అందుకు తగ్గట్టుగానే బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ నటీ నటులను తీసుకు వచ్చాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలీయా భట్ .. అజయ్ దేవగన్.. శ్రీయ శరన్.. బ్రిటన్ మోడల్ ఓలియా మోరీస్ తో పాటు పలువురు విదేశీ నటులు ఆర్ ఆర్ ఆర్ లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇక గత ఏడాది నుంచి ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని ప్రతీ ఒక్కరు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఎన్.టి.ఆర్ కొమరం భీం గా రాం చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గా శక్తి వంతమైన పాత్రలు పోషిస్తున్నారు. ఫిక్షన్ కథాంశంతో ఎన్.టి.ఆర్, రాం చరణ్ పోరాట యోధులుగా చూపించబోతున్న రాజమౌళి ఇప్పటికే ఇద్దరి పాత్రలకి సంబంధించిన టీజర్స్ ని రిలీజ్ చేసి ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్ఠిని ఆకట్టుకున్నాడు.

కాగా తాజాగా ఆర్ ఆర్ ఆర్ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది అక్టోబర్ 13 న రిలీజ్ చేస్తున్నట్టు రాజమౌళి బృందం అధికారకంగా పరకటించారు. వాస్తవంగా అక్టోబర్ 8 నే ఆర్ ఆర్ ఆర్ థియేటర్స్ లోకి వస్తుందని అందరు భావించారు. కాని ఈ సినిమాలో నటిస్తున్న ఒక నటీమణి రిలీజ్ డేట్ లీక్ చేయడం తో తాజాగా రిలీజ్ డేట్ మార్చి అక్టోబర్ 13 కి మార్చారు. ఇప్పుడు తాజాగా అదే డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. కాగా రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ నుంచి ఈ నెల 26 భారీ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా రామరాజు – భీం లతో కూడుకున్న టీజర్ రిలీజ్ చేయబోతున్నట్టు .. ఈ టీజర్ కి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్టు సమాచారం.