కరోనా లాక్ డౌన్ కారణంగా 7 నెలల సుధీర్ఘ విరామం తర్వాత రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ ని సెట్స్ మీదకి తీసుకు వచ్చాడు. ఈ నెల 5 నుంచి సెట్స్ మీదకి వచ్చిన ఆర్ ఆర్ శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. మరోవైపు ఏరోజు జరిగిన రష్ ఆ రోజు ఎడిటింగ్ కూడా జరుగుతోందట. ఎటువంటి పరిస్థితుల్లోను ఈ నెల 22 న రామరాజు ఫర్ బీమ్ వీడియో టీజర్ ని రిలీజ్ చేయాలని ఎంతో కసిగా రాజమౌళి షూటింగ్ జరుపుతున్నారు.
ఇక ఇప్పటికే బీం ఫర్ రామరాజు వచ్చి మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులందరినీ విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ వీడియో వచ్చినప్పటి నుంచి ఎన్.టి.ఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా నెలల నుంచి ఎదురు చూస్తున్నారు. ఆ సమయం మరికొన్ని రోజుల్లో రాబోతుంది. అంతేకాదు ఈ వీడియో టీజర్ తర్వాత నుంచి కూడా ఆర్ ఆర్ ఆర్ నుంచి ఏదో ఒక అప్డేట్ వచ్చి ప్రేక్షకులను ఉత్సాహపరుస్తూనే ఉంటారని తెలుస్తుంది.
ఇక రాజమౌళి ప్రస్తుతం తారక్ మీద చిత్రీకరణ జరుపుతుండగా నవంబర్ నుంచి ఆలియా మీద షూట్ మొదలు పెడతారని సమాచారం. ఇప్పటికే ఆలియా హైదరాబాద్ కూడా చేరుకుందని ప్రస్తుతం క్వారంటైన్ లో ఉందని సమాచారం. ఇక ఆలియా కూడా రాజమౌళి కి ఫుల్ సపోర్ట్ చేస్తూ దాదాపు రెండు నెలలకి పైగానే బల్క్ డేట్స్ కేటాయించిందట.
నవంబర్ నుంచి ఆలియా మీద ఆ తర్వాత రాం చరణ్ – ఆలియా మీద కాంబినేషన్ సీన్స్ ని కంప్లీట్ చేయనున్నారట రాజమౌళి. ఇక రామరాజు – భీం ని కలిపేది కూడా ఆలియా నే అని సమాచారం. ఆలియా ద్వారానే కలిసే రామరాజు – భీం ల కీలకమైన సన్నివేశం సినిమాకే హైలెట్ గా నిలవబోతుందట. ఒకే ఫ్రేం లో తారక్-చరణ్ కనిపించడం చూస్తే ఒక్కొక్కరికి రోమాలు నిక్కబొడుచుకుంటాయని సమాచారం.