ఎస్ ఎస్ రాజమౌళి – యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – మెగా పవర్ స్టార్ రాం చరణ్ ల అత్యంత క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా కోసం దేశం మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది. ఈ ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి పాన్ ఇండియన్ సినిమాగా భారీ బడ్జెట్ తో మల్టీ స్టారర్ అనౌన్స్ అయినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు కారణం రాజమౌళి బాహుబలి ఫ్రాంఛైజీ వంటి గొప్ప సినిమా తర్వాత రాజమౌళి.. ఎన్.టి.ఆర్, చరణ్ లు పోరాట యోధులుగా చూపిస్తున్నారు.
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గా రాం చరణ్.. కొమరం భీం గా ఎన్.టి.ఆర్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరి పాత్రల కి సంబంధించిన టీజర్స్ సినిమా మీద అంచనాలకి ఊహకందనంతగా పెంచాయి. ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ చరణ్ కి జంటగా సీత పాత్రలో నటిస్తోంది. బ్రిటన్ మోడల్ ఓలియా మోరిస్ ఎన్.టి.ఆర్ కి జంటగా నటిస్తున్న సంగతి తెల్సిందే. అలాగే అజయ్ దేవగన్, శ్రియ శరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో నిర్మాత డీవీ దానయ్య దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా కేటగిరీలో ఈ సినిమాని నిర్మిస్తుండగా 2021 సమ్మర్ లో రిలీజ్ చేయాలని దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా లాంగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా వెంటనే మహబళేశ్వరం లో మొదలు పెట్టారు. కాగా తాజా సమాచారం ప్రకారం రాజమౌళి ఈ సినిమా ట్రైలర్ కి డేట్ ఫిక్స్ చేసినట్టు సమాచారం.
నూతన సంవత్సరం అయిన జనవరి 1 వ తేదిన ఆర్ ఆర్ ఆర్ నుంచి ట్రైలర్ రిలీజ్ కానుందట. ఆ రోజు డేట్ ఫిక్స్ చేయడానికి ముఖ్య కారణం కొత్త సంవత్సరం అన్న ఉత్సాహంలో అందరూ ఉంటారు కాబట్టి ఆ ఉత్సాహాన్ని రెట్టింపు చేయాలనే రాజమౌళి ఇలా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ ట్రైలర్ లో రామరాజు, భీం పాత్రలని చూపించబోతున్నాడట. అంటే ఈసారి చరణ్ – తారక్ లను ఒకేసారి చూడబోతున్నాము.