Rajamouli- mahesh Babu: హాట్ టాపిక్ గా మారిన రాజమౌళి – మహేష్ బాబు ప్రాజెక్ట్ ‘బడ్జెట్’.. ఏకంగా అన్ని కోట్లు!

Rajamouli- mahesh Babu: రాజమౌళి దర్శకత్వంలో పలు భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ ప్రస్తుతం థియేటర్లో బాగా హడావుడి చేస్తుంది. సినిమా విడుదలైన మూడు రోజులల్లో 500 కోట్లతో సెన్సేషనల్ క్రియేట్ చేసుకుంది. ఇదంతా పక్కన పెడితే తాజాగా రాజమౌళి తర్వాత రాబోయే సినిమా గురించి బాగా చర్చలు వస్తున్నాయి.

ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేయనున్నట్లు గతంలో తెలిపాడు. ఇక ఈ సినిమా ఆఫ్రికా అడవిలో నేపథ్యంలో రూపొందనుంది. ఇటీవలే ఈ సినిమా గురించి కొన్ని విషయాలు విజయేంద్రప్రసాద్ కూడా తెలిపాడు. ఇక ఈ సినిమా బాహుబలి, ఆర్ఆర్ఆర్ కంటే పెద్ద ప్రాజెక్ట్ అని తెలియటంతో.. అభిమానులలో మరింత ఊరట కనిపిస్తుంది. ఇక కనీసం ఈ సినిమా కోసం 800 కోట్ల రూపాయల బడ్జెట్ అవుతుందని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.