మనలో చాలా మందికి రాజ్ తరుణ్ అంటే కేవలం హీరోగానే మాత్రం తెలుసు. కానీ దర్శకుడు అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన సంగతి కొందరికే తెలుసు. మొదటి చిత్రం ఉయ్యాల జంపాల అవకాశం రావడం, దానికి అసిస్టెంట్ డైరెక్డర్‌గా ఉన్నవాడు కాస్తా హీరోగా మారడం అలా మంచి గుర్తింపును తెచ్చుకోవడంతో టాలీవుడ్‌లో హీరోగా ఫిక్స్ అయ్యాడు. తాజాగా రాజ్ తరుణ్ ఓ షోలో పాల్గొని అనేక విషయాలను తెలిపాడు
ఉయ్యాలా జంపాలా చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన రాజ్ తరుణ్… స్క్రీన్‌ప్లే, డైలాగ్ రాయడంలో కూడా సాయం చేశాడట. హీరోల కోసం వెతుకుతుంటే ‘ఎవరో ఎందుకు నువ్వే చేయొచ్చు కదా’ అని అన్నారట. ఉయ్యాల జంపాలలో హీరోయిన్ పాత్ర చాలా ముఖ్యమని, దాంతో ఆడిషన్స్ చేయడం మొదలు పెట్టారుట. లోబడ్జెట్ ఫిల్మ్ కావడంతో అప్పటికి డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో తాను ఒక్కడినే ఉండేవాడట. దాదాపు 30మంది అమ్మాయిలను ఆడిషన్ చేశారుట. వారితో పాటు తాను కూడా డైలాగ్‌లు చెబుతూ ఉండేవాడిట. అది వాళ్లకు నచ్చి, ‘వేరే వాళ్లు ఎందుకు నువ్వే చేసేయొచ్చు కదా’ అని హీరోగా అవకాశం ఇచ్చారుట.
అల్లు అర్జున్‌కు, సునీల్‌కు వేర్వేరుగా కథలు కూడా రాశాడట. ఏదైనా కథ రాసినప్పుడు ఎవరినో ఒకరిని ఊహించుకుని రాస్తాం కదా! అలా ఆ రెండు కథలు వారిని ఊహించుకుని రాశా అని చెప్పేశాడు. ఎప్పటికైనా ఈ సినిమాలు చేస్తా అని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పుకొచ్చాడు. ‘రంగులరాట్నం’, ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’లో రెండు పాటలు కూడా రాశాడట. ఇలా రాజ్ తరుణ్ మల్టీ టాలెంటెడ్ అని అందరికీ తెలిసింది.