బిగ్‌బాస్ నాల్గో సీజన్‌లో చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్న కంటెస్టెంట్లలో నోయల్ ఒకడు. ఎగ్జామ్‌కు ఫుల్లుగా ప్రిపేర్ అయి వచ్చిన స్టూడెంట్ ఎలా వెలిగిపోతుంటాడో నోయల్ కూడా అలానే ఫుల్ జోష్‌లో ఉన్నాడు. కానీ బిగ్‌బాస్ హౌస్‌లో కావాల్సింది ప్రిపరేషన్ కాదు.. బిహెవియర్, క్యారెక్టర్. ఎంతగా ప్రిపేర్ అయినా, షో రహస్యాలు తెలుసుకున్న పరిస్థితులకు తగ్గట్టు ఎలా మసులుకుంటారన్న విషయం మీదే అంతా ఆధారపడుతుంటుంది. పరిస్థితులు చూస్తుంటే నోయల్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్నట్టు కనిపిస్తున్నాయి.
నోయల్ మొదటి నుంచి అందరి అభిప్రాయాలను ప్రభావితం చేస్తున్నట్టు, తన నిర్ణయాన్నే వారిపై రుద్దేందుకు ప్రయత్నిస్తోన్నట్టు కనిపిస్తోంది. తాజాగా నోయల్ బిగ్‌బాస్ వెనుక రాహుల్ సిప్లిగంజ్ ఉన్నట్టు కనిపిస్తోంది. రాహుల్ బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు కూడా నోయల్ గెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచిన రాహుల్ ఓ మీడియాతో ముచ్చటిస్తుండగా.. నోయల్ ఫోన్ కాల్ చేశాడు.
అలా నోయల్ ఫోన్ చేసినప్పుడు మాటలో మాటగా.. నెక్స్ట్ నిన్నే పంపిస్తాను అంటూ మాటిచ్చాడు. నిన్ను బిగ్‌బాస్‌లోకి పంపిస్తాను అని రాహుల్ సరదాకి చెప్పాడో లేదా నిజంగానే చెప్పాడో ఏమో గానీ ప్రస్తుతం ఈ వీడియో మాత్రం తెగ చక్కర్లు కొడుతోంది. అన్ని విషయాలు, సీక్రెట్స్, స్ట్రాటజీలు తెలుసుకుని పక్కాగా ప్లాన్ చేసుకుని వచ్చాడని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ప్రిపరేషన్స్ ఎంత వరకు పనికి వస్తాయి.. రాహుల్ సిప్లిగంజ్ మద్దతు ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి.