రాహుల్ సిప్లిగంజ్ అంటే బిగ్‌బాస్ షోకు ముందు బిగ్‌బాస్ షో తరువాత. బిగ్‌బాస్‌కు వెళ్లకముందు కూడా రాహుల్ సిప్లిగంజ్ అంటే ఓ పేరు ఉంది. ప్లే బ్యాక్ సింగర్, ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తాడంటూ ఓ పేరుండేది. ఇండిపెండెంట్ మ్యూజిక్ చేయడంతో రాహుల్ యూట్యూబ్‌లో కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేశాడు. మంగమ్మ, గల్లీకా గణేష్ అంటూ కొత్త కొత్త ఆల్బమ్స్‌తో యూట్యూబ్‌లో రెచ్చిపోయాడు.
అయితే బిగ్‌బాస్ షో తరువాత రాహుల్ క్రేజ్ మొత్తం మారిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాహుల్ సిప్లిగంజ్ పేరు ఓ రేంజ్‌లో మార్మోగింది. బిగ్‌బాస్ మూడో సీజన్ విన్నర్ అనే ట్యాగ్ రాహుల్‌ను ఎక్కడికో తీసుకెళ్లింది. ప్లే బ్యాక్ సింగర్‌గా, నటుడిగా ఇలా ఎన్నో అవకాశాలు పెరిగాయి. ఇండస్ట్రీలోనూ ఓ గౌరవం లభించింది. రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ ద్వారా స్టార్ స్టేటస్ సంపాదించాడు.
అయితే బిగ్ బాస్ తరువాత.. రాహుల్ ఒక్క ప్రైవేట్ ఆల్బమ్ కూడా చేయలేదు. అయితే ఈ మధ్య బేబీ అనే ఓ ఆల్బమ్‌కు శ్రీకారం చుట్టాడు. దీన్ని అత్యంత భారీ ఎత్తున ప్లాన్ చేశాడు. అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వేసి యష్ మాస్టర్ ఆధ్వరంలో కంపోజ్ కూడా చేసేస్తున్నాడు. ఇక ఈ సెట్ ఆ క్యాస్టింగ్ చూస్తేనే తెలుస్తోంది. బేబీ కోసం భారీగానే ఖర్చు పెడుతున్నాడని. మూడు రోజులు ఈ పాటను తెరకెక్కిస్తారట.