దుర్గం చెరువు వద్ద రచ్చ.. రాహుల్ సిప్లిగంజ్ ప్లాన్ అదుర్స్!!

Rahul Sipligunj Album Shoot At Durgam Cheruvu Cable Bridge

రాహుల్ సిప్లిగంజ్ ప్రస్తుతం తెగ బిజీ అవుతున్నాడు. మొన్నామధ్య బేబీ అంటూ నానా రచ్చ చేశాడు. అన్నపూర్ణ స్టూడియాలో భారీ సెట్ వేసి గ్రాండ్‌గా బేబీ ఆల్బమ్‌ను క్రియేట్ చేశాడు. బిగ్ బాస్ తరువాత రాహుల్ చేసిన ఫస్ట్ ఆల్బమ్ కాబట్టి గ్రాండ్‌గా ఉండాలన్న ఉద్దేశ్యంతో భారీగానే ఖర్చు పెట్టాడట. ఆ సెట్ కోసమే విపరీతంగా ఖర్చు జరిగిందని చెప్పుచ్చాడు. మూడు రోజుల పాటు అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన రిహార్సల్స్, షూటింగ్‌లకు సంబంధించిన వీడియోలను రాహుల్ షేర్ చేసేవాడు.

Rahul Sipligunj Album Shoot At Durgam Cheruvu Cable Bridge
Rahul Sipligunj Album Shoot At Durgam Cheruvu Cable Bridge

అలా మొత్తానికి బేబీ రిలీజ్ కాకముందు మంచి హైప్ క్రియేట్ అయ్యేలా చేశాడు. అలా బేబీ ఆల్బమ్ మొత్తానికి క్లిక్ అయింది. దాన్ని హిందీలోకి కూడా పట్టుకెళ్తానన్నాడు. ఇకపై తన ప్రతీ ఆల్బమ్‌ను కూడా హిందీలోనూ ప్లాన్ చేస్తానని అన్నాడు. బేబీ లిరిక్స్ మీద వచ్చిన ట్రోలింగ్స్, నోయల్ లిరిక్స్‌ను రాహుల్ సపోర్ట్ చేయడం అందరికీ తెలిసిందే. ఇదంతా కాసేపు పక్కన పెడితే మరో కొత్త ఆల్బమ్‌ చేసేందుకు రాహుల్ రెడీ అయ్యాడు.

ఇది ప్యూర్ హైద్రాబాద్ ఆంథమ్‌లా అనిపిస్తోంది. హైద్రాబాద్ అందాలను, ఇక్కడి సౌందర్యాన్ని చూపించేలా ఈ ఆల్బమ్ ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలను రాహుల్ షేర్ చేశాడు. ఇప్పుడు హైదరాబాద్ అంటే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్. అందుకే దానిపై స్పెషల్ సాంగ్‌ను కంపోజ్ చేస్తున్నాడు. దుర్గం కేబుల్ బ్రిడ్జ్‌పై ఈ స్పెషల్ సాంగ్ షూట్ జరుగుతోంది. ఇందులో చాలా మంది డ్యాన్సర్లు పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియోలు బాగానే వైరల్ అవుతున్నాయి.