ఎవరిదో ఎంగేజ్మెంట్ అయితే నాకేంటి.. పునర్నవిపై రాహుల్ సెన్సేషనల్ కామెంట్స్

Rahul Sipligunj About Punarnavi Engagement And Baby Album

బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ పునర్నవి జంట గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. రాహుల్ అంటే పునర్నవి గుర్తుకు వస్తుంది.. పునర్నవి అంటే రాహుల్‌కు గుర్తుకు వస్తుంది. అది అంతే. ఎందుకంటే వీరిద్దరూ బిగ్ బాస్ షోలో చేసిన మ్యాజిక్ అటువంటిది. ఇద్దరూ కలిసి పండించిన కెమిస్ట్రీకి అందరూ ఫిదా అయ్యారు. పునర్నవికి అంత క్రేజ్ రావడానికైనా.. బిగ్ బాస్ విన్నర్‌గా రాహుల్ నిలవడానికైనా ఆ కెమిస్ట్రీ బాగానే ఉపయోగపడింది.

Rahul Sipligunj About Punarnavi Engagement And Baby Album
Rahul Sipligunj About Punarnavi Engagement And Baby Album

అలాంటి రాహుల్ సిప్లిగంజ్.. పునర్నవి ఎంగేజ్మెంట్ వార్తలపై ఓ రేంజ్‌లో సెటైర్ వేశాడు. మామూలుగానే పునర్నవి టాపిక్ వచ్చిన ప్రతీసారి రాహుల్ వస్తాడు. అలాంటిది పునర్నవి ఎంగేజ్మెంట్ అంటే రాహుల్ టాపిక్ రాకుండా ఉంటుందా? కొందరేమో రాహుల్‌కు అన్యాయం చేశావా? అని సెటైర్లు వేశారు. రాహుల్‌ని అయితే కాదులో ఆ చేతులు తెల్లగా ఉన్నాయ్ కదా అంటూ ఇంకొందరు కౌంటర్లు వేశారు.

Rahul Sipligunj About Punarnavi Engagement And Baby Album
Rahul Sipligunj About Punarnavi Engagement And Baby Album

కానీ రాహుల్ మాత్రం పునర్నవి ఎంగేజ్మెంట్‌పై వెరైటీగా స్పందించాడు. ఎవరిదో ఎంగేజ్మెంట్ అయితే నన్నేందుకు ట్యాగ్ చేస్తున్న్రా భై అంటూ నవ్వేశాడు. ఉన్న పోరీలతోనే సరిపోతలేదు నాకు, ఇంకా ఎక్స్‌ట్రా ఫిట్టింగ్‌లు నాకేందుకురా నాయన.. అంటూ దండం పెట్టేశాడు. రేపు (అక్టోబర్ 29) బేబీ సాంగ్ రిలీజ్ కాబోతోందని చెప్పుకొచ్చాడు. మ్యూజిక్ వీడియో వస్తోంది గెట్ రెడీ అంటూ అందర్నీ అలెర్ట్ చేశాడు. అయితే ఈ ఎంగేజ్మెంట్ అనేది వెబ్ సిరీస్ కోసం పునర్నవి చేస్తోన్న పబ్లిసిటీ స్టంట్ అని తెలుస్తోంది.