ఇది జస్ట్ శాంపిల్.. రాహుల్ పోస్ట్ వైరల్

Rahul Sipligunj about Ooko Kaka

బిగ్ బాస్ మూడో సీజన్ విజేతగా రాహుల్ సిప్లిగంజ్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పనక్కర్లేదు. అయితే అంతకు ముందు కూడా రాహుల్‌కు ఫాలోయింగ్ ఉంది. ప్లే బ్యాక్ సింగర్, ప్రైవేట్ ఆల్బమ్స్‌తో రాహుల్ యూట్యూబ్‌లో రచ్చ చేశాడు. కానీ బిగ్ బాస్ వల్ల రాహుల్ అందరికీ తెలిశాడు. క్యారెక్టర్, వ్యక్తిత్వం, నిజాయితీ ఇలా అన్నింటా రాహుల్ అందరినీ మెప్పించాడు. అందుకే మూడో సీజన్ విజేతగా నిలిచాడు.

అప్పటి నుంచి రాహుల్ క్రేజ్ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలో పునర్నవితో రహస్య బంధం బాగా క్లిక్ అయింది. కానీ బయటకు వచ్చాక ఈ ఇద్దరూ అంత క్లోజ్‌గా ఉండటం లేదు. రాహుల్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక తన ఇమేజ్‌ను పెట్టుబడి పెట్టి చేసిన బేబీ ఆల్బమ్ అంతగా వర్కవుల్ అవ్వలేదు. అది నష్టాలనే మిగిల్చినట్టు కనిపిస్తోంది. తాజాగా రాహుల్ తన స్నేహితుడి బ్రాండ్ దుస్తులను ప్రమోట్ చేసేందుకు రెడీ అయ్యాడు.

Rahul Sipligunj about Ooko Kaka
Rahul Sipligunj about Ooko Kaka

ఊకో కాక అంటూ కొత్త బ్రాండ్‌తో రాబోతోన్న బ్రాండెండ్‌ దుస్తులను ప్రమోట్ చేసే క్రమంలో రాహుల్ ఆ దుస్తులను ధరించాడు. ఊకో కాక క్యాస్టూమ్ ఫస్ట టైమ్ వేసుకున్న.. ఇది జస్ట్ శాంపిల్.. స్టోర్‌కి వస్తే కళ్లు జిగేల్ అనాలే.. రేపు కరీంనగర్‌కి పొద్దుగాల వస్తా.. మధ్యాహ్నాం తింటా.. రాత్రి ఆడ్నే పంట.. రేపు పది గంటలకు అక్కడే కలుసుకుందాం అంటూ తన అభిమానులకు అప్డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం రాహుల్ ధరించిన డ్రెస్, షేర్ చేసిన పిక్ రెండూ వైరల్ అవుతున్నాయి.