`47 డేస్` చెత్త సినిమా అన్నందుకు..!!
జీ5 స్ట్రీమింగ్ లో 47 డేస్ మూవీ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. క్రైమ్ మర్డర్ మిస్టరీ జోనర్ లో రూపొందించిన ఈ సినిమా చెత్త ట్రీట్ మెంతో విసుగు పుట్టించిందని క్రిటిక్స్ విమర్శించారు. అయితే ఈ విమర్శల్ని చిత్రబృందం యథావిధిగానే తట్టుకోలేకపోతోంది. ముఖ్యంగా ఈ చిత్రానికి సంగీతం అందించిన రఘు కుంచె కాస్త ఎక్కువే ఆవిస్తే ఇంకేదో అయినట్టే ఉంది. అందుకే ఆయన తీవ్ర నిరాశలో ఉన్నారట.
47 డేస్ ఒక నాశిరకం చిత్రం. అందులో కథ కానీ.. కథనం కానీ.. ఎంచుకున్న లొకేషన్లు కానీ.. తెరకెక్కించిన విధానం కానీ ఏదీ అస్సలు కనెక్టవ్వదు. పైగా గజిబిజి కన్ఫ్యూజన్ స్క్రీన్ ప్లే విసుగు తెప్పిస్తుంది. ల్యాగ్ సన్నివేశాలతో ఆద్యంతం బోర్ కొట్టిస్తుంది. ఈ విషయాన్ని చెప్పిన క్రిటిక్స్ పై ఈ చిత్రానికి సహ నిర్మాతగా ఉన్న సంగీత దర్శకుడు రఘు కుంచె సీరియస్ గా ఉన్నారట. రేటింగ్స్ చూసి షాక్ అయినట్లు తెలుస్తోంది.
అయితే ఆయనే సంగీతం అందించి ఓ కీలక పాత్ర పోషించిన `పలాస 1978` చిత్రానికి ఇదే క్రిటిక్స్ అద్భుత రేటింగ్స్ ఇచ్చారు. శ్రీకాకుళం యాసను భాషను కల్చర్ ను అద్భుతంగా ఆవిష్కరిస్తూ గ్యాంగ్ స్టర్స్ కథను.. మ్యూజికల్ మిరాకిల్ లా క్రియేట్ చేశారంటూ ప్రశంసలు కురిపించారు. కానీ ఈసారి సినిమా తేడా కొట్టింది. విమర్శలు ఎదురయ్యాయి. అప్పుడు పొగిడిన వాళ్లే ఇప్పుడు తిట్టారు. దానికి ఫీలవ్వడం ఎందుకు? అర్థం చేసుకుని మారాలి కానీ. ఇలాంటి తప్పిదాలు ఇక రిపీటవ్వకుండా జాగ్రత్త పడితే మంచి సినిమాలు తీయాలి కానీ.. ఒకవేళ 47 డేస్ నేరుగా థియేటర్లలోకి రిలీజై ఉంటే ఒకటో రోజునే తొలగించాల్సి వచ్చేదేమో! నష్టపోకుండా డిజిటల్ స్ట్రీమింగ్ బాగానే కాపాడిందనేది మెజారిటీ వీక్షకుల అభిప్రాయం.