అయ్యో రాశీ ఖన్నాను పిచ్చిదాన్ని చేసేశాడే.. సాయి ధరమ్ తేజ్ మామూలుడో కాదు!

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తెరపై ఎంత సరదాగా కనిపిస్తాడో రియల్ లైఫ్‌లోనే అంతే సరదాగా ఉంటాడు. మెగా హీరోల్లో కూల్‌గా ఫ్రెండ్లీగా హంబుల్‌గా ఉండే వారిలో తేజూ ఒకడు. క్రమశిక్షణతో ఉండటం, షూటింగ్‌కు సరైన టైంకు రావడం ఇలా మెగా ఫ్యామిలీ పరంపరను కొనసాగిస్తున్నాడు. అయితే ఈ హీరోలో కాస్త చిలిపితనం కూడా ఉంది. తన చుట్టూ ఉండేవారిని ఆట పట్టిస్తుంటాడు. సెట్ అంతా సందడిగా ఉండేలా చేస్తాడు.

Raashi Khanna Special Birthday Wishes To Sai Dharam Tej
Raashi Khanna Special Birthday Wishes To Sai Dharam Tej

తాజాగా రాశీ ఖన్నాను సాయి ధరమ్ తేజ్ ఆట పట్టించాడు. నేడు (అక్టోబర్ 15) సాయి ధరమ్ తేజ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా రాశీ ఖన్నా ఓ వీడియోను షేర్ చేస్తూ బర్త్ డే విషెస్ తెలిపింది. ఆ వీడియోలో రాశీ ఖన్నాను తేజూ పిచ్చిదాన్ని చేసేశాడు. మామూలుగా ఆడవాళ్లు సెల్ఫీ అనడంతోనే ఎన్ని రకాలుగా పోజులు పెడతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక అందులోనూ హీరోయిన్లైతే ఇక ఏ రేంజ్‌లో పోజులిస్తారో తెలిపింది.

అలా సాయి ధరమ్ తేజ్ సెల్ఫీ తీస్తున్నాడేమో అని రాశీ ఖన్నా కూడా పోజిచ్చింది. అయితే ఎంతకీ ఫోటో తీయకపోవడంతో అసలు విషయం అర్థం చేసుకుంది. అది ఫోటో కాదు వీడియో అంటూ అరిచింది. రాశీ ఖన్నా అలా ఫూల్ అవ్వడంతో సుప్రీం హీరో ఫక్కున నవ్వేశాడు. నా క్రేజీ ఫ్రెండ్‌కు హ్యాపీ బర్త్ డే.. ఈ ప్రపంచంలోని సంతోషం అంతా నీ వద్దే ఉండాలంటూ విష్ చేసింది. ఇక వీరిద్దరు సుప్రీమ్, ప్రతిరోజూ పండగే చిత్రాలతో లక్కీ పెయిర్ అని నిరూపించుకున్న సంగతి తెలిసిందే.