రకుల్ ను ఆవహించిన పుష్పరాజ్…తగ్గేదేలే అంటున్న నటి!

అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పుష్ప. ఈ సినిమా గత ఏడాది 17వ తేదీ విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదలయ్యి ఏడాది కావస్తున్న ఇంకా ఈ సినిమాకి ఎలాంటి క్రేజ్ తగ్గలేదు.ఈ సినిమా తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చినప్పటికీ కొందరికి పుష్ప సినిమా ఫేవరెట్ సినిమాగా ఉండిపోయింది.

ఇక ఈ సినిమా కేవలం ప్రేక్షకులను మాత్రమే కాకుండా ఎంతోమంది సినీ సెలబ్రిటీలను కూడా సందడి చేసిందని చెప్పాలి.ఇకపోతే తాజాగా నటి రకుల్ ప్రీత్ సింగ్ అభిమానులతో కలిసి సరదాగా ముచ్చటించారు. తనకు సినిమా షూటింగ్ విరామ సమయంలో ఏమాత్రం ఖాళీగా దొరికిన విడుదల అయినా ప్రతి ఒక్క సినిమాలను తప్పకుండా చూస్తానని ఎన్నోసార్లు వెల్లడించారు. అయితే తాజాగా అభిమానులతో సరదాగా ముచ్చటించిన రకుల్ కి అభిమానుల నుంచి ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది.

ఈ మధ్యకాలంలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి అని అభిమానులు తనని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు రకుల్ సమాధానం చెబుతూ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్టైల్ లో తగ్గేదేలే అని సిగ్నేచర్ మూమెంట్ ఉన్న ఫోటోని షేర్ చేస్తూ తనకు రీసెంట్ గ నచ్చిన సినిమాలలో పుష్ప సినిమా నచ్చిందని సమాధానం చెప్పేశారు. ఇలా ఇందుకు సంబంధించిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సినిమా విడుదలై దాదాపు సంవత్సరమవుతున్నప్పటికీ ఇంకా ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదంటే ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో అర్థమవుతుంది.