బ‌న్నీ అభిమానుల‌కు గుడ్ న్యూస్..నవంబ‌ర్ నుండి సంద‌డి షురూ

ఈ ఏడాది అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన అల్లు అర్జున్ త‌న త‌ర్వాతి చిత్రంగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా గంధ‌పు చెక్క‌ల నేప‌థ్యంలో తెర‌కెక్క‌నుంది. క‌రోనా వ‌ల‌న ఈ చిత్ర షూటింగ్ ఏడు నెల‌లుగా వాయిదా ప‌డింది. ఇప్పటికే చాలా చిత్రాలు సెట్స్ పైకి వెళ్ళిన బ‌న్నీ అండ్ టీం మాత్రం ఇంకా సందిగ్ధంలోనే ఉన్నారు. అయితే ఇలా ఆలస్యం చేస్తూ వెళితే క‌ష్ట‌మవుతుంద‌ని భావించిన మేక‌ర్స్ నవంబ‌ర్ నెల‌లో షూటింగ్ స్టార్ట్ చేయాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌.

ఆర్య, ఆర్య 2’ చిత్రాల తర్వాత స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగుతున్న ఈ సినిమా చిత్రీకరణ చిత్రీకరణను ముందుగా శేషాచలం అడవుల్లో, కేరళ అడవుల్లో జరుపుతారని ప్రచారం జరిగింది. కాని కరోనా వ‌ల‌న లొకేష‌న్ మారింది. మరో వారం రోజుల్లో ఆంధ్రలోని రంప చోడవరం, మారేడిమిల్లి ప్రాంతాల్లో ‘పుష్ప’ మూవీ షూట్ ప్రారంభం కానుంద‌ని స‌మాచారం. అక్క‌డ ఉన్న ఉడ్స్ రిస్టార్ట్ మొత్తాన్ని ఇప్ప‌టికే యూనిట్ కోసం రిజ‌ర్వ్ చేశార‌ట‌. తొంద‌ర‌ప‌డ‌క‌పోతే సినిమా రిలీజ్ చాలా లేట్ అవుతుంద‌ని భావించిన యూనిట్ క‌రోనా గైడ్ లైన్స్ పాటిస్తూ న‌వంబ‌ర్‌లో షూటింగ్ ప్రారంభించి వీలైనంత త్వ‌ర‌గా కంప్లీట్ చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌.

పుష్ప చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు. చిత్రంలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్‌ పుష్పరాజ్ రోల్‌లో అలరించనుండగా.. పల్లెటూరు పిల్లలా డిఫెరెంట్ క్యారెక్టర్ పోషిస్తోంది రష్మిక. ఇప్ప‌టికే బ‌న్నీ లుక్స్ విడుద‌ల కాగా, ఆయ‌న లుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తొలిసారి ప్యాన్ ఇండియా మూవీ చేస్తున్న బ‌న్నీ ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళ భాష‌లలో రిలీజ్ చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌.