పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా డైలాగ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా?

Allu Arjun Preparation For Pushpa

పుష్ప సినిమాలో ఉన్నటువంటి డైలాగ్స్ ఎలా పాపులర్ అయ్యాయో మనకు తెలిసిందే.చిన్నపిల్లల నుంచి మొదలుకొని సెలబ్రిటీల వరకు పెద్ద ఎత్తున ఈ డైలాగ్స్ చెబుతూ సిగ్నేచర్ మూమెంట్ చేస్తూ రీల్స్ చేసిన విషయం తెలిసిందే. ఇలా పుష్ప సినిమాలోని డైలాగులు పాటలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇకపోతే ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్ అనే డైలాగ్ ఓ రేంజ్ లో బ్లాస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే.ఇకపోతే ఈ డైలాగు వెనుక ఉన్న స్టోరీని తాజాగా అల్లు అర్జున్ సైమా అవార్డు వేడుకగా బయటపెట్టారు.

ఈ సినిమా టైటిల్ ప్రకటించక చేయకముందు తాను డైరెక్టర్ హరీష్ శంకర్ ను కలిసానని తెలిపారు. ఇలా ఆయనతో మాట్లాడుతున్న సమయంలో ఈ సినిమా టైటిల్ చెప్పగానే హరి శంకర్ పుష్ప అంటే ఫ్లవర్ కదా అని అన్నారు. టైటిల్ అమ్మాయి పేరు లాగా ఉందని అలాగే టైటిల్ కూడా కాస్త సాఫ్ట్ గా ఉందని హరి శంకర్ చెప్పారు. అయితే నేను ఈ విషయాన్ని సుకుమార్ గారి దగ్గర ప్రస్తావించలేదు. కొన్ని రోజుల తర్వాత పుష్ప అంటే ఫ్లవర్ అని మీనింగ్ వస్తుంది కదా..ఇలాంటి మీనింగ్ వస్తే పెద్దగా బాగోదు అని అల్లు అర్జున్ సుకుమార్ దగ్గర ఈ సినిమా టైటిల్ విషయం గురించి ప్రస్తావించారట.

ఇలా అల్లు అర్జున్ సందేహం వ్యక్తం చేయడంతో వెంటనే సుకుమార్ గారు పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్ అనే డైలాగ్ రాశారని,ప్రతి ఒక్కరిలో వచ్చిన ఈ సందేహానికి ఈ డైలాగ్ సమాధానం అంటూ అల్లు అర్జున్ ఈ డైలాగ్ పెట్టడం వెనుక ఉన్న రీజన్ తెలియజేశారు. మొత్తానికి ఈ డైలాగ్ ఎంతో ఫేమస్ అయిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి ఈ సుమారు సంవత్సరమవుతున్నప్పటికీ ఇంకా ఈ సినిమాకు ఎలాంటి క్రేజ్ తగ్గలేదు. త్వరలోనే ఈ సినిమా సీక్వెల్స్ షూటింగ్ పనులను ప్రారంభించబోతున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.