Pushpa 2: పుష్ప సినిమాని రిలీజ్ చేయకూడదు.. డిమాండ్ చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే?

Pushpa 2: మరికొన్ని గంటలలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలని అల్లు అర్జున్ అరెస్టు చేయాలి అంటూ కొంతమంది రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సినిమా టికెట్ల రేట్లు అధికంగా ఉన్నాయి అంటూ కోర్టులో పిటిషన్ వేయగా కోర్టు ఈ పిటిషన్ ని పూర్తిగా కొట్టివేసింది. ఇకపోతే తాజాగా ఆర్మూరు బిజెపి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలని అల్లు అర్జున్ అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా రాకేష్ రెడ్డి పుష్ప సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో చూపించిందంతా పూర్తిగా అబద్ధం అని తెలిపారు. ఎర్రచందనం ధర 10 లక్షల రూపాయలు మాత్రమే ఉంటే ఈ సినిమాలో మాత్రం కోటి రూపాయలనీ చూపించారు. ఈ సినిమా చూసిన తర్వాత ఎంతోమంది యువత లక్షలాది ఎర్రచందనం చెట్లను నరికేశారు అంటూ ఈయన వ్యాఖ్యానించారు.

ఇక ఇప్పుడు పుష్ప రెండవ పార్టు ను రిలీజ్ చేస్తున్నారని మండిపడ్డారు. రెండవ పార్ట్ సినిమా చూసిన తర్వాత ఇంకెన్ని లక్షల చెట్లు నరికేస్తారో ? అనే భయం అందరిలోనూ ఉందని అందుకే ఈ సినిమాని విడుదల చేయకూడదు అంటూ ఈయన డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇలాంటి సినిమాని చేసిన నటుడు అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ ఇద్దరిని కూడా అరెస్టు చేయాలని తెలిపారు.

ఈ సినిమా గురించి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి అయితే ఈ వ్యాఖ్యలపై పలువురు బన్నీ ఫాన్స్ స్పందిస్తూ అది రియల్ కాదు సినిమా అనే విషయాన్ని ముందు ఎమ్మెల్యే గారు గ్రహించాలి అంటూ కామెంట్లు చేయగా మరికొందరు సినిమాల గురించి నీకెందుకు ముందు ఎమ్మెల్యేగా నువ్వు చేయాల్సిన పనులన్నింటిని పూర్తి చేయి అంటూ మరోవైపు నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు.