మైత్రీ మూవీస్ మేకర్స్ పతాకంపై యర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్, సుకుమార్ రైటింగ్స్, ముత్తంశెట్టి మీడియాతో కలిసి నిర్మించిన భారీ చిత్రం పుష్ప 2. ఈనెల 5వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగా కలెక్షన్లను కొల్లగొడుతోంది. బాలీవుడ్‌లో ఈ సినిమా సృష్టిస్తున్న ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటివరకు ఈ సినిమా రూ.580 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి సంచలనం సృష్టిస్తుంది.
ఒక తెలుగు సినిమా ఆ రేంజ్‌లో కలెక్షన్లు సాధించడం అంటే మాములు విషయం కాదు.. పుష్ప 2 రిలీజై రెండు వారాలకు దగ్గరకు వస్తున్నా.. ఇంకా ఇసుమంత కూడా క్రేజ్ తగ్గలేదు. ఈ సినిమా ధాటికి నార్త్ టు సౌత్ అన్ని రికార్డులు తుడుచుకుపెట్టు పోతున్నాయి.ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. సినిమా థియేటర్‌లో ఉండగానే.. పుష్ప2 ఓటీటీ డేట్ వైరల్ అవుతుంది.
మేకర్స్ ముందుగా కుదుర్చుకున్న సమాచారం ప్రకారం… నెట్‌ఫ్లిక్స్‌తో పుష్ప2 మేకర్స్ 5 వారాలా డీల్‌ను కుదుర్చుకున్నారట.పుష్ప మొదటి భాగానికి సంబంధించి అమెజాన్ ప్రైమ్ ఓటీటీ హక్కులను సంపాదించింది. ఇందుకోసం అప్పట్లోనే రూ. 30 కోట్లు ఖర్చు చేసింది. అయితే పుష్ప 1 సంచలన విజయం, ప్రస్తుతం పుష్ప 2పై దేశవ్యాప్తంగా ఉన్న హైప్ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీ హక్కులకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. అమెజాన్‌తో పోటీ పడి మరి పుష్ప 2 ఓటీటీ హక్కులను కళ్లు చెదిరే మొత్తానికి నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందని ఫిలింనగర్ టాక్ .
ఓటిటి రిలీజ్ విషయానికి వస్తే…పుష్ప 2 ది రూల్ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చే ఏడాది అంటే 2025 జనవరి 9వ తేదీన స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. మామూలుగా పెద్ద సినిమాలు థియేటర్లలో వచ్చిన 40-50 రోజులకు ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంటుంది. ఈ సినిమా సౌత్ ఇండియన్ వెర్షన్ ముందుగా ఓటిటి లో రిలీజ్ చేసి, ఆ తర్వాత హిందీ వెర్షన్ ని స్ట్రీమింగ్ చేస్తారని సమాచారం. నార్త్ లో సినిమా కలెక్షన్స్ ఇప్పటికీ బాగుండటంతో అక్కడ లేటు చేస్తున్నారని, అలాగే అక్కడ సినిమా పరిశ్రమ రూల్స్ ప్రకారం కూడా ఓటీటీ డేట్ ని ఫిక్స్ చేసి ముందుకు వెళ్తారని వినికిడి.