రిలీజ్ కి ముందే రికార్డులు బద్దలు కొడుతున్న పుష్ప 2.. రిలీజ్ తర్వాత ఇంకెన్ని రికార్డులో!

పుష్ప సినిమా ముందుగా ఊహించినట్లుగానే సినిమా రిలీజ్ కి ముందే బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతుంది. డిసెంబర్ 5న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నవంబర్ 30న పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కాగా లక్షలాది టికెట్లు సేల్ అయ్యాయి. కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణతో సహా పలు రాష్ట్రాల్లో శనివారం పుష్ప 2 టికెట్లు అందుబాటులోకి వచ్చాయి.

టికెట్ల కోసం దేశవ్యాప్తంగా ఉన్న పుష్పరాజ్ ఫ్యాన్స్ పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో టికెట్లు బుక్ అయ్యాయి. అయితే ఇంకా తెలంగాణ, ఆంధ్ర, కేరళ తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో నవంబర్ 1న బుకింగ్స్ ప్రారంభించలేదు. కేరళలో ఆదివారం అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అయినా నిన్న ఒక భారతదేశంలోనే మల్టీప్లెక్స్ లలో 55000 కంటే ఎక్కువ టికెట్లు ముందస్తుగా బుక్ అయ్యాయి.

సింగిల్ స్క్రీన్ థియేటర్లను కలుపుకుంటే తొలిరోజే 2.79 లక్షల టికెట్లు బుక్ అయ్యాయి. ఈ స్పీడ్ చూస్తుంటే బాహుబలి 2 రికార్డుని పుష్పటు సినిమా బద్దలు కొట్టే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు సినీ విశ్లేషకులు. ఆంధ్రలో కూడా అడ్వాన్స్ టికెట్ బుకింగ్ ఓపెన్ అయితే ఈ సంఖ్య పెరుగుతుందనేది స్పష్టం అవుతుంది.ఇప్పటివరకు ఈ సినిమా ప్రి సెల్ బుకింగ్స్ లోనే 60 కోట్లకి పైగా వసూలు చేసినట్లు సమాచారం.

దీంతో బాహుబలి, ఆర్ ఆర్ ఆర్, కే జి ఎఫ్ టు, ల ఫస్ట్ డే కలెక్షన్స్ను పుష్ప 2 దాటేస్తుందని సినీ అభిమానులు భావిస్తున్నారు. ప్రీ బుకింగ్స్ తో పుష్ప 2 ఒక అరుదైన రికార్డుని ఖాతాలో వేసుకుంది ఇప్పటివరకు బీ టౌన్ లో రికార్డులు సృష్టించిన టైగర్ త్రీ 65000, యానిమల్ 52,500, డంకీ 42,000, స్త్రీ 2, 41000 సినిమాలను పుష్ప 2 బీట్ చేసి బాలీవుడ్ లోనే ఆల్ టైం టాప్ సినిమాల లిస్టులో మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. చూడాలి, రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో.