పుష్ప స్టేజ్ పై కనిపించని సపోర్టింగ్ యాక్టర్స్.. కారణం ఏమిటో!

డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషలలో పుష్ప 2 సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయింది. సినిమా విడుదల కి ముందే ఎన్నో రికార్డులని బద్దలు కొట్టి మరెన్నో రికార్డులని తన ఖాతాలో వేసుకుంది ఈ సినిమా. ఈ సినిమా విడుదలకు ముందు ప్రమోషనల్ ఈవెంట్స్ అని దేశంలో చాలా ప్రాంతాలలో ఈవెంట్లు నిర్వహించారు ఈ మూవీ టీం.

అన్ని ప్రమోషనల్ ఈవెంట్స్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి మొన్న హైదరాబాదులో జరిగిన ప్రమోషన్ ఈవెంట్ అయితే ఫుల్ ఎమోషనల్ తో నిండిపోయింది. బన్నీ సుకుమార్ బాండింగ్ చూసి అందరూ కన్నీరు పెట్టుకున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే ప్రతి ఈవెంట్ లో కూడా హీరో, హీరోయిన్ డైరెక్టర్ తప్పితే వేరే సపోర్టింగ్ యాక్టర్స్ ఎవరూ స్టేజ్ పై కనిపించలేదు.

అలాగే సినిమా రిలీజ్ అంటే సపోర్టింగ్ యాక్టర్స్ చాలామంది యూట్యూబ్లోనూ, టీవీల్లోనూ చాలా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక్క వీడియో గాని ఒక్క ఇంటర్వ్యూ కానీ రాకపోవడం, పైగా సినిమాలో వేసిన సపోర్టింగ్ యాక్టర్లు నార్మల్ వ్యక్తులు కాదు అందరూ పెద్ద నటులే. హైదరాబాదులో జరిగిన ఈవెంట్ కి అనసూయ మాత్రమే హాజరైంది. ఇంకా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో పోషించిన ఫాహద్ ఫాజిల్, సునీల్, జగపతిబాబు.

రావు రమేష్, కన్నడ స్టార్ ధనుంజయ్, పుష్ప ఫ్రెండ్ పాత్రలో నటించిన జగదీష్, శ్రీదేవి, పుష్ప తల్లి పాత్రలో నటించిన కల్పలత బ్రహ్మాజీ, ఆదిత్య మీనన్ ఇలా చాలామంది నటులు ఉన్నారు. కానీ వీరు ఎవరు ప్రమోషన్స్ లో కనిపించలేదు. అయితే ఈ నటులు వారికిగా వారు ఈ సభలలో పాల్గొని లేదా లేదంటే సుకుమార్ ఏదైనా ప్లానింగ్ తో వారిని ఈవెంట్స్ కి పిలవలేదా అనేది ఎవరికి అర్థం కావడం లేదు. కనీసం సక్సెస్ మీట్ కైనా వీళ్ళందరూ కనిపిస్తారో లేదో చూడాలి.