“పుష్ప 2” కూడా అదే స్ట్రాటజీ..!

ఇప్పుడు తెలుగు సినిమాల మార్కెట్ కానీ ఇండియన్ సినిమాల మార్కెట్ గాని వరల్డ్ వైడ్ గా వేరే లెవెల్ కి చేరుకుంది. ఓ  సినిమా మార్కెట్ ని పెంచింది కూడా మన తెలుగు సినిమాలే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీనితో ఈ దారిలోనే ఇతర సినిమాలు కూడా ప్రపంచ వ్యాప్తంగా వైడ్ రిలీజ్ ని చేసుకుంటున్నారు.

అయితే టాలీవుడ్ నుంచి దర్శకుడు రాజమౌళి సినిమాలు గేమ్ ఛేంజింగ్ సినిమాలుగా రాగా వీటి తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప” సినిమా కూడా నిలిచింది. ఈ సినిమా మొదటి భాగం హిట్ కావడంతో రెండో పార్ట్ ని వీలైనంత బిగ్గెస్ట్ రిలీజ్ వీలైనన్ని ఎక్కువ భాషల్లో రిలీజ్ చేస్తామని స్వయంగా అల్లు అర్జున్ చెప్పాడు.

అయితే ఈ ప్లాన్ ని ఆల్రెడీ హీరో సూర్య నటిస్తున్న “కంగువ” మేకర్స్ ఫిక్స్ కూడా చేసేసుకున్నారు. తమ సినిమా ఏకంగా 32 భాషల్లో విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు. దీనితో పుష్ప 2 రిలీజ్ కి మాత్రం బిగ్ టాస్క్ నే మిగిలి ఉందని చెప్పాలి. కాగా పుష్ప 2 ని ఏ లెవెల్లో మేకర్స్ రిలీజ్ ప్లాన్ చేస్తారో చూడాలి మరి.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికా మందన్నా నటించగా ఫహద్ ఫాజిల్ తదితరులు నటిస్తున్నారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మరి సుకుమార్ మరియు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా గ్రాండ్ గా తెరకెక్కుతుంది.